కాజల్ క్రేజ్ తగ్గుతుందన్న భయంతో సీక్రెట్ రివీల్ చేసిన దర్శకుడు...!
ఇప్పటి వరకు 'వీర" సినిమాలో కాజల్ మెయిన్ హీరోయిన్ అనుకుంటూ వస్తున్నారు. కానీ..ఆమె మెయిన్ హీరోయిన్ కాదంట. తాప్సీనే మెయిన్ హీరోయిన్ అని..కాజల్ కేవలం సెకండ్ సెటప్ మాత్రమేనని తేల్చి చెబుతున్నారు ఆ చిత్ర దర్శకనిర్మాతలు..'వీర" సినిమా 20వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. సినిమా చూసాక, కాజల్ ఫ్యాన్స్ ఫీలయిపోతారేమోనన్న ముందు చూపుతో ఈ విషయాన్ని లీక్ చేసారు. కాకపోతే కాజల్ ది ఖతర్నాఖ్ క్యారెక్టర్ అంట.
ఇందులో కబడ్డీ ప్లేయర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న కాజల్ మిగతా క్యారెక్టర్లతో కబడ్డీ ఆడేసుకుంటుందట. క్యారెక్టర్లతో కబడ్డీ ఆడేసుకుంటుందంట. క్యారెక్టర్స్ తో ఆడుకుంటే పర్వాలేదు. ఆడియన్స్ తో ఆడుకుంటేనే కష్టం అంటున్నారు.. నిజానికి కాజల్ కెరీర్ ప్రస్తుతానికి మంచి ఊపు మీదుంది. 'డార్లింగ్", 'బృందావనం", మిస్టర్ ఫర్ ఫెక్ట్" చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన కాజల్ కు తాప్సీ జత కలవడం, రవితేజ ప్రీవియస్ మూవీస్ 'డాన్ శీను", 'మిరపకాయ్" చిత్రాలు హిట్టయి ఉండడంతో 'వీర" చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
వీటన్నింటికీ తోడు 'వీర" దర్శకుడు రమేష్ వర్మ గత చిత్రం 'రైడ్" కూడా ఓ మోస్తరు విజయం సాధించి ఉండడం కూడా ఇందుకు కారణం మరి ఇంతమంది హిట్ కాంబినేషన్ లో వస్తున్న 'వీర" వీరవిహారం చేస్తుందో..'వీర" బాదుడు బాదుతుందో మరో 48గంటల్లో తేలిపోనుంది..!


Click it and Unblock the Notifications











