యంగ్ అంబాసిడర్స్ గా బ్రూ కాఫీని షేర్ చేసుకొన్న పాపులర్ జంట...!?
'నాన్ మహాన్ అల్లా(నా పేరు శివ) చిత్రంలో కలిసిన నటించిన కార్తీ, కాజల్ ఓ బ్రూ కాఫీకి సంబంధించిన కమర్షియల్ యాడ్ లో కలిసి నటించారు. గతంలో ఈ బ్రూ కాఫీ యాడ్ లో సూర్య జ్యోతిక నటించారు. ఇప్పుడు సూర్య ప్లేస్ ని అతని తమ్ముడు కార్తీ కైవసం చేసుకోవడం విశేషం.
ఇప్పటికే కార్తీ, కాజల్ నటించిన ఈ బ్రూ కాఫీ యాడ్ ప్రసారం అవుతోంది. తెలుగు, తమిళంలో ఈ ఇద్దరూ పాపులర్ అవ్వడం వలల్లే యంగ్ అంబాసిడర్స్ గా ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేసే అవకాశం వీరిని వరించిందని సమాచారం. ఈ యాడ్ లో ఈ జంట చాలా బాగుందనే టాక్ వినబడుతోంది.
ప్రస్తుతం కాజల్ తమిళంలో 'మాత్రన్" అనే సినిమాలో సూర్యకి జంటగా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా వెలిగిన కాజల్ రెండు సినిమాలు ప్లాపయ్యేసరికి కాస్త ఇబ్బంది పడుతోంది. అయితే మహేష్ బిజినెస్ మ్యాన్" తో మళ్ళీ ఫామ్ లోకి వస్తానని ఆమె ఆశిస్తోంది.


Click it and Unblock the Notifications











