కాజల్ కేకపెట్టిస్తోంది: 'టెంపర్' వర్కింగ్ స్టిల్...(ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : పూరి జగన్నాధ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపందుతున్న చిత్రం టెంపర్. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ చేస్తోంది. గతంలో పూరి దర్శకత్వంలో బిజినెస్ మ్యాన్ చిత్రంలో చేసిన కాజల్ మరోసారి తన అందాలు ఆరబోయటానికి సిద్దమయ్యింది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వర్కింగ్ స్టిల్ ఒకటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చూసిన వాళ్లు కాజల్ ...స్లిమ్ లుక్ లో అదరకొడుతోంది అని మెచ్చుకుంటున్నారు.

ఇక తెరపై అందంగా కనిపించే విషయంలో కాజల్‌కి తిరుగులేదు. చూపులతోనే కుర్రకారుని మత్తెక్కించే మహత్తు ఆమెలో ఉంది. ఎనిమిదేళ్లుగా తెరపై కనిపిస్తున్నప్పటికీ... మళ్లీ మళ్లీ చూడాలనిపించేంత అందం కాజల్‌ సొంతం. అలాగని అందం పేరుతో ఆమె ఎప్పుడూ హద్దు దాటలేదు. పోనీ అందాల ఆరబోతకి వ్యతిరేకమా అంటే అదీ కాదంటోంది. అసలు ఆ విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అని అడిగితే...కాజల్ సమాధానం చెప్తోంది.

కాజల్ మాట్లాడుతూ... ''చిట్టిపొట్టి దుస్తుల్లోనే అందంగా కనిపిస్తామనుకోవడం పొరపాటు. చీరకట్టులోనూ అందంగా కనిపించొచ్చు. జీన్స్‌, టీషర్టులు వేసుకొని కూడా కుర్రకారును మురిపించొచ్చు. తొలినాళ్లల్లోనే నేను ఆ విషయాల్ని అర్థం చేసుకొన్నాను. అందుకు తగ్గట్టుగానే తెరపై కనిపిస్తుంటాను. దక్షిణాదితో పోలిస్తే హిందీ సినిమాల్లో కాస్త ఘాటుగానే కనిపించాలి. అలాగని నాకు చేతకాదు అనకూడదు. అందం వరకు ఓకే కానీ అసభ్యంగా మాత్రం కనిపించకూడదు. ఆ రెండింటి మధ్య తేడాని గమనించి నడుచుకోవాలి. ఇంకా ఎన్నేళ్లయినా ప్రేక్షకులని ఇలాగే అలరించగలనన్న ఆత్మ విశ్వాసం నాకుంది'' అని సెలవిచ్చింది కాజల్‌.

Kajal kills her with slim looks in “Temper”

సినిమా విషయానికి వస్తే...

టెంపర్ లో మంచి ట్విస్ట్ లు, టర్న్ లు ఉన్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో చేసినప్పటికి ఇది స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. మరో ప్రక్క డిసెంబర్ 1 వ తేదీన టెంపర్ టీజర్ విడుదల చేయటానికి సిద్దం చేస్తున్నారు. ఎడిటర్ ఎస్.ఆర్ శేఖర్ ఈ మేరకు ఆ వీడియో ఎడిటింగ్ పనిలో బిజీగా ఉన్నారు.

ఇన్నాళ్లూ గోవాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి ఇప్పటివరకూ ఏ టైటిలూ అఫీషియల్ గా ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో ఇప్పటివరకూ నేనో రకం, టెంపర్ అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘టెంపర్' అనే టైటిల్ ని ఫైనల్ చేసిననట్లు సమాచారం. ఈ మేరకు డిజైన్స్ చేయించి చూసినట్లు తెలుస్తోంది.ఈ వారంలోనే ఓ టైటిల్ ని ఫైనల్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదలనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూనిట్ రాత్రింబవళ్లూ కష్టపడుతున్నట్లు వినపడుతోంది.

ఎన్టీఆర్‌ సినిమా అంటే మాస్‌ ప్రేక్షకులకు పండగే. పోరాట ఘట్టాలూ, నృత్యాలూ, పదునైన సంభాషణలతో విందు భోజనం వడ్డించేస్తారు. ఇలాంటి కథల్ని తెరపై ఆవిష్కరించడంలో దిట్ట పూరి జగన్నాథ్‌. వీరిద్దరి కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కాజల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్‌ నిర్మాత.

ఇప్పటివరకూ గోవాలో యాక్షన్‌ ఘట్టాలతో పాటు కొన్ని సరదా సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ శక్తిమంతమైన పోలీసు అధికారిగా కనిపిస్తాడని సమాచారం. జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ .

మరో ప్రక్క...కొంతకాలం దర్శకుడు,హీరో మధ్య ఇగో క్లాషెష్, కొంతకాలం భారీ వర్షాలు, మరికొంతకాలం స్ట్రైక్ ఇలా రకరకాల కారణాలు..పూరీ, ఎన్టీఆర్ సినిమాను ఆలస్యం చేస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆ లేటు వెళ్లి ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పూరీ. అందులో భాగంగా లైవ్ ఎడిటింగ్ ని చేయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందునిమిత్తం గోవా షూటింగ్ స్పాట్ కు ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ వెళ్లారు. గతంలో ఎస్.ఆర్.శేఖర్.. పూరి చిత్రం ఇద్దరమ్మాయిలతో ట్రైలర్ కట్ చేసారు. ఆ ట్రైలర్ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే.

షూటింగ్ అయిన దాన్ని ఎప్పటికప్పుడు ఎడిట్ చేసేస్తూంటారు. దాని మూలంగా బాగా రాని షాట్స్, మర్చిపోయిన షార్ట్ ఎప్పటికప్పుడు తెలిసిపోయి... ప్యాచ్ వర్క్ వంటివి నివారించవచ్చు. అలాగే ఎడిటింగ్ అయ్యే సమయం కలిసివస్తుంది. ప్రస్తుతం రఫ్ ఎడిటింగ్ చేసుకుని చివర్లో కాస్త టైమ్ తీసుకుని ఫైనల్ ఎడిటింగ్ చేసేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X