కిరాకు పుట్టించేలా ఎన్టీఆర్‌కు కాజల్ కిస్సు...
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్' మూవీ విడుదల దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై ఆసక్తి పెంచేలా చేస్తున్నారు టెంపర్ ప్రమోషన్ టీం. ముఖ్యంగా సినిమాపై ఆసక్తిని పెంచేలా స్టిల్స్, పోస్టర్లు రోజుకొకటి విడుదల చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్, కాజల్‌కు సంబంధించిన రొమాంటిక్ ఫోటో విడుదల చేసారు. ఎన్టీఆర్‌ను కాజల్ ముద్దాడుతున్న ఫోటో కిరాకు పెట్టించేలా ఉంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సినిమా విషయానికొస్తే ప్రస్తుతం ఈ మూవీ సెన్సార్‌కు వెళ్లింది. నేటి సాయంత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ బయటకు రానుంది. ఈ చిత్రం రన్ టైమ్ లాక్ చేసారు. ‘టెంపర్' సినిమా రన్ టైం సుమారు 141 నిమిషాలు ఉంటుంది. ఇదే లెంగ్త్ కి ఈ చిత్ర టీం ఫస్ట్ కాపీని రెడీ చేసారని సమాచారం. అందులో ఫస్ట్ హాఫ్ 1 గంట 8 నిమిషాలు, సెకండాఫ్ 1 గంట 13 నిమిషాలు ఉండబోతోంది.
‘టెంపర్' మూవీ ఈ నెల 13న గ్రాండ్‌గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం భారీగా సంఖ్యలో థియేటర్లలలో విడుదలవుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 250 స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే యూఎస్ఏలో 125 లొకేషన్లు ఫిక్స్ అయ్యాయి. యూకె, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇతర దేశాల్లో 100 లొకేషన్లు ఖరారైనట్లు తెలుస్తోంది. మరో 25 లొకేషన్లు రిలీజ్ నాటికి ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లో ఈ చిత్రం అత్యధిక ఓపెనింగ్స్ వసూళ్లు సాధించే చిత్రగా నిలవనుంది అంచనా వేస్తున్నారు.
ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











