హాట్ స్టార్ కాజల్ కొత్త సినిమా టైటిల్...'తథాస్తు'
మగధీర చిత్రంతో టాప్ స్టార్ గా ఎదిగిన కాజల్ రీసెంట్ గా తధాస్తు అనే చిత్రం ఓకే చేసింది. అయితే ఆ చిత్రం కన్నడంలో నిర్మాణమవుతుంది. ఈ చిత్రం ద్వారా కాజల్ కన్నడంలో తెరంగ్రేటం చేయనుంది. కొత్త దర్శకుడు రఘు హసన్ తాను తీయబోతున్న 'తథాస్తు' సినిమాకోసం కాజల్‌ను సంప్రదించగా, ఆమె అంగీకారం తెలిపినట్టు తెలిసింది. 'తథాస్తు'లో హీరోగా చిరాగ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని హసన్ తెలిపారు. "మొదట ఈ సినిమాకోసం బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ను సంప్రదించాం. అయితే ఇప్పుడు దాదాపుగా కాజల్ అగర్వాల్‌ను ఖరారు చేశాం" అని ఆయన అన్నారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ వుంటుందని హీరో చిరాగ్ కూడా చెప్పారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాని అంజలీ నాగరాజ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో మూడు, తమిళంలో రెండు చిత్రాల్తో బిజీగావున్న కాజల్ త్వరలోనే 'తథాస్తు' షూటింగ్‌లో పాల్గొంటుందని తెలుస్తోంది. ఇక కాజల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన బృందావనంలోనూ, ప్రభాస్ సరసన దశరధ్ దర్శకత్వంలో వచ్చే చిత్రంలోనూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











