»   » కాజల్ కొత్తగా... సెక్సీగా.. (ఫోటోలు)

కాజల్ కొత్తగా... సెక్సీగా.. (ఫోటోలు)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: లక్ష్మి కళ్యాణ్ చిత్రం ద్వారా తెలుగులో తెరంగ్రేటం చేసిన హీరోయిన్ కాజల్ 'చందమామ' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా అలా సాగుతున్న కాజల్ సినీ కెరీర్ 'మగధీర' బంపర్ హిట్ తో దశ తిరిగింది. ఆ దెబ్బతో తెలుగులో వరుస అవకాశఆలతో టాప్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తోంది.

  పరిశ్రమలోకి ఎంతో మంది కొత్త హీరోయిన్లు వస్తున్నా.... వారితో పోపడుతూ ఇటు నటన పరంగా, అటు గ్లామర్ పరంగా ఎప్పటికప్పుడు తనను తాను అప్ డేట్ చేసుకుంటూ దూసుకెలుతున్న మిత్రవింద.... తాజాగా తన అందంలోని స్టైలిష్ కోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది. ఇవన్నీ కాజల్ కు సంబంధించిన సరికొత్త ఫోటోలు.

  కాజల్ సినిమాల విషయానికొస్తే..
  కాజల్ చివరి సారిగా 'తుపాకి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన మరో మూడు చిత్రాలు నెల రోజుల గ్యాప్ తో విడుదల కానున్నాయి. అందులో ముందుకు ఆమె రవితేజతో జోడీగా నటించిన 'సారొచ్చారు' చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది.

  ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వివి వినాయక్ దర్శకత్వంలో కాజల్ నటించిన 'నాయక్' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక ఆమె నటించిన మరో బాలీవుడ్ చిత్రం 'స్పెషల్ చబ్బీస్' ఫిబ్రవరి 8, 2013న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆమె అక్షకుమార్ సరసన నటించింది. ప్రస్తుతం కాజల్ తెగులో బాద్ షా చిత్రంతో పాటు, తమిళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఇక రామ్ చరణ్ ఎవడు చిత్రంలో ఆమె గెస్ట్ రోల్ గా నటిస్తోంది.

  తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది. ఈమె 2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన చందమామ సినిమాలో కథానాయికగా నటించింది. కాజల్ కు తొలి కమర్షియల్ హిట్

  2009లో మెుగాస్టార్ చిరంజీవి తనయుడైన రామ చరణ్ తేజ తో రాజమౌలి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే.

  2010లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎంటీయార్ తో బృందావనంలో సమంతతో పాటుగా నటించింది. తరవాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు. ప్రస్తుతం తెగులో కాజల్ బాద్ షా చిత్రంలో నటిస్తోంది. ఆమె నటించిన నాయక్, సారొచ్చారు. చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

  2010లో ఈమె ప్రముఖ తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన నా పేరు శివ చిత్రంలో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2012 లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ సినిమాలో నటించారు. ప్రస్తుతం సూర్య సరసన మాట్రన్ అనే తమిళ సినిమాలో నటిస్తూంది.

  English summary
  Kajal Aggarwal made her film debut in the 2004 Bollywood film Kyun...! Ho Gaya Na and entered the Telugu film industry through the film Lakshmi Kalyanam. She had her first commercial success with Chandamama and rose to prominence after her performance in Magadheera, which remains her biggest commercial success.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more