కాజల్ కి బాగా బుద్ది వచ్చింది
హిందిలో ఓ సినిమా రాగానే సౌత్ సినిమాని కామెంట్ చేస్తూ దొరికిపోయిన కాజల్ కి బుద్ది వచ్చిందంటున్నారు ఇక్కడివాళ్ళు. ఎందుకంటే ఆమె చేసిన హిందీ చిత్రం సింగంలో కాజల్ పాత్రని ఎడిటింగ్ టేబుల్ వద్ద నిర్దాక్ష్యణంగా నరికేసాడు దర్సకుడు. ఎందుకు..ఏమిటి అని అడిగితే సమాధానం కూడా చెప్పలేదు. తెలుగు, తమిళంలో ఎంతో గౌరవం పొందే ఈ ముద్దగుమ్మకు అది అవమానమే. దాంతో ఆ చిత్రం ప్రమేషన్ కి కూడా అటెండ్ కావటం లేదు. ఈ నేఫధ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినిమాపై ప్రేమను ఒలకపోసింది.
ఆమె మాటల్లోనే...ముంబై నా స్వస్థలం. అయితే నా కెరీర్‌కు బీజం పడింది మాత్రం దక్షిణాదిలోనే. అందుకే తెలుగు సినిమాలకు దూరం కాను అంది. అలాగే..ప్రతి భాషలో కొన్ని ప్రత్యేకతలుంటాయి. వాటిని అర్థం చేసుకొని నటిగా ముందుకు నడవాలనేది నా అభిలాష అంది.ఇక తమిళంలో సూర్యతో ప్రస్తుతం ఓ చిత్రం చేస్తున్నా. 'రంగం'తో అందర్నీ మెప్పించిన కె.వి.ఆనంద్ దర్శకుడు. హీరోయిన్ పాత్రను చాలాబాగా తీర్చిదిద్దారు. తప్పకుండా నా కెరీర్‌లో మంచి చిత్రంగా నిలిచిపోతుంది అంది.


Click it and Unblock the Notifications











