కాజల్ కొత్త చిత్రం 'ఓం శాంతి' విశేషాలు
కాజల్, నవదీప్, నిఖిల్, బిందు మాధవి, అదితి శర్మ కాంబినేషన్లో త్రి ఏంజిల్స్ పతాకంపై ఓ శాంతి అనే చిత్రం అనే చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎపిసోడిక్ నేరేషన్ లో ఆరు కథలు కలిసి ఓ క్లైమాక్స్ లో ఇంటర్ లింక్ ఉండేలా ఈ కథనం రూపొందుతోంది. ఈ చిత్రం ఆడియోను నవంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రకాష్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. హాలీవుడ్ లో వచ్చిన క్రాష్ (ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్)తరహాలో ఉంటుందంటున్నారు. ఇక మొదటి చిత్రం బాణం తోనే అభిరుచి ఉన్న నిర్మాతలుగా పేరుతెచ్చుకున్న శేషు ప్రియాంక చలసాని(అశ్వనీదత్ కుమార్తెలు) ఈ చిత్రం నిర్మాతలు కావటంతో మంచి క్రేజ్ వస్తోంది. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ నవంబర్ 18 న జరగనుంది.
కాజల్ నవదీప్ నిఖిల్ బిందు మాధవి అదితి శర్మ మగధీర బంపర్ ఆఫర్ గుండె ఝల్లుమంది ఆస్కార్ ఇళయరాజా kajal navdeep bindu madhavi adithi sharma magadheera bumper offer


Click it and Unblock the Notifications