‘ది బిజినెస్ మేన్’ మహేష్ తో డార్లింగ్ రొమాన్స్...
'మగధీర' నుంచి మొన్నటి 'బృందావనం', నిన్నటి 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' సినిమా వరకు పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని, అగ్రస్థానం కోసం పోటీపడుతున్న కథానాయిక కాజల్ కు, ఒక దానిని మించిన ఆఫర్ మరొకటిగా వస్తున్నాయిప్పుడు. ఒక్కో సినిమాకి కోటి పాతిక లక్షల వరకు డిమాండ్ చేస్తున్నప్పటికీ, హీరోలు ఆమె వైపే మొగ్గుచూపిస్తున్నారు.
తాజాగా మహేష్ బాబు సరసన నటించే అవకాశం కూడా ఆమెకు వచ్చినట్టు చెబుతున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే 'ది బిజినెస్ మేన్' సినిమాలో కథానాయికగా కాజల్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న 'దూకుడు' సినిమా పూర్తయ్యాక ఇది జూలైలో మొదలవుతుందని అంటున్నారు. మహేష్ సరసన కాజల్ తొలిసారిగా నటిస్తోందన్నమాట!
More from Filmibeat
kajal mahesh babu puri jagannath the business man dookudu కాజల్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ ది బిజినెస్ మేన్ దూకుడు


Click it and Unblock the Notifications











