హీరోయిన్ కాజల్ దిగజారిందని అంటున్నారు!
హైదరాబాద్: హీరోయిన్ కాజల్ కు దక్షిణాది సినిమాల్లో ఒకప్పుడు ఎంత డిమాండ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆమె నటించిన తెలుగు చిత్రం 'మగధీర' విజయం సాధించిన తర్వాత ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ ఫెక్ట్, బిజినెస్ మేన్, నాయక్, బాద్ షా లాంటి చిత్రాల్లో నటించి తెలుగు నాట కొంత కాలం నెం.1 హీరోయిన్ గా వెలుగు వెలిగింది. రెమ్యూనరేషన్ కూడా అమ్ముడు కోటికిపైనే తీసుకునేది.
అయితే ఆ మధ్య బాలీవుడ్ సినిమాలపై మోజుతో అటు వైపు తన ప్రయాణం మొదలుపెట్టిన కాజల్ ఆశించిన మేర అక్కడ సక్సెస్ కాలేదనే చెప్పాలి. దీంతో ఇటు తెలుగు, తమిళంలోనూ ఆమెకు అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో హిందీలో స్టార్ డమ్ రాక పోవడం కూడా ఆమె కెరీర్ కు శాపంగా మారింది.

తాజాగా కాజల్ మరో హిందీ సినిమాకు కమిట్ అయింది. అందులో హీరోగా నటించేది బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి. ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోలకు తప్పితే మరెవరికీ డేట్స్ ఇవ్వని కాజల్.....ఇప్పుడు బాలీవుడ్లో శర్మాన్ జోషి లాంటి సెకండ్ గ్రేడ్ హీరోల సినిమాలకు డేట్స్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. కాజల్ కెరీర్ పరంగా దిగజారిపోయిందనడానికి ఇదొక నిదర్శనమని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ విమర్శలుకు కాజల్ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











