'చిరుత' సినిమాలో యూత్ ని రెచ్చకొట్టేలా ఎక్స్ పోజ్ చేస్తూ..అందాలు గుమ్మరించిన నేహా శర్మ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కనిపించబోతోందని విశ్వసనీయ సమాచారం. మొదట ఈ పాత్రకు కాజల్ అనుకున్నారు. కానీ కాజల్ ఈ సినిమాలో తనది సెకెండ్ హీరోయిన్ పాత్ర అని తెలుసుకుని వైదొలిగినట్లు తెలుస్తోంది. వెంటనే వినాయిక్ మదిలో నేహా శర్మ మెదలటంతో ఆమెను కాంటాక్ట్ చేసి ఒప్పించారని చెప్పుతున్నారు. ఇక నేహా ..చిరుత తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తానని చెప్పిన ఆమెకు పెద్ద ఆఫర్స్ రాకపోవటం ఏవీ తలుపు తట్టకపోవటం జరిగింది. ఒకరిద్దరు చిన్న నిర్మాతలు ఆమె కోసం ట్రై చేసారు కానీ ఆమె సున్నితంగా తిరస్కరించింది. త్వరలోనే ఆమెకు సంబంధించిన కాంబినేషన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ వార్త తెలిసిన మిగతా హీరోయిన్స్ లక్కంటే ఆమెదే అప్పుడు రామ్ చరణ్,ఇప్పుడు ఎన్టీఆర్ అని కామెంట్ చేసుకుంటున్నారు.