పవన్ కళ్యాణ్‌ సరసన కాజల్, మెగా సంతృప్తి!

By Bojja Kumar

హైదరాబాద్ : హీరోయిన్ కాజల్ ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ మినహా అందరి హీరోలతో చేసింది. రామ్ చరణ్ తో మగధీర, అల్లు అర్జున్‌తో ఆర్య 2 చిత్రంలో చేయడంతో పాటు, చందమామ సినిమాలో నాగబాబుతో కూడా కలిసి నటించింది. అయితే అమ్మడుకి టాలీవుడ్ టాప్ హీరో పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం మాత్రం ఇప్పటి వరకు రాలేదు.

పరిశ్రమలో అందరు అగ్రహీరోలతో చేసినా పవన్ కళ్యాణ్ సినిమాలో చేయలేదనే అసంతృప్తి కాజల్‌ను గత కొంత కాలంగా వెంటాడుతూనే ఉంది. ఎట్టకేలకు కాజల్ కోరిక నెరవేరబోతోంది. ఆమె పూర్తిగా మెగా సంతృప్తి పొందే సమయం ఆసన్నమైంది. ఆమెకు పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా, ఈ చిత్రం తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈచిత్రంలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. త్వరలో ఈ విషయమై పూర్తి సమాచారం వెలువడనుంది.

ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంభందించిన వర్క్ మొదలయిందని సంపత్ నందికి క్లోజ్ గా ఉండే వారు అంటున్నారు. అయితే పూర్తిగా ఓకే అయ్యేదాకా ప్రాజెక్టు వివరాలు బయిట పెట్టకూడదని సంపత్ ఎక్కడా ఈ మ్యాటర్ పై మాట్లాడటం లేదని,అందుకే మీడియాకు కూడా దొరకకుండా పూర్తిగా స్క్రిప్టుపై దృష్టి పెట్టాడని వినికిడి. ఈ చిత్రానికి 'చోటా మేస్త్రీ' అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని పవన్ సన్నిహితుడు శరత్ మరార్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. చాలా కాలంగా పవన్ కళ్యాణ్, శరత్ మరార్ పమంచి స్నేహితులు కావటంతో ఈ అవకాశం శరత్ మరార్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తో తాను చేయబోయే చిత్రం అనంతరం ఈ చిత్రం ఉంటుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈచిత్రంలో సమంత, ప్రణీత హీరోయిన్లు. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X