ఫాల్స్ న్యూస్ అంటూ రాజమౌళి ఖండన
రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో త్వరలో రూపొందబోయే చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజమౌళి తన ట్విట్టర్ దానికి సంభందించిన ఖండన ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే... ప్రభాస్ సినిమాలో కాజల్ ని తీసుకున్నాననేది ఫాల్స్ న్యూస్. ఇప్పటివరకూ ఇంకా నటీనటుల ఎంపిక ప్రారంభించలేదు అన్నారు. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ లో ప్రారంభం కానుంది. రాజమౌళి చిత్రం కోసం ప్రభాస్ సైతం ఏ చిత్రమూ ఒప్పుకోకుండా ప్రస్తుతం చేస్తున్న రెబెల్ చిత్రం పూర్తి చేసి డేట్స్ ఖాళీగా పెట్టుకున్నారు. రెబెల్ చిత్రాన్ని కాంచనతో హిట్టు కొట్టిన లారెన్స్ డైరక్ట్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం రాజమౌళి ఈగ చిత్రం బిజీలో ఉన్నారు. సమంత, నాని జంటగా నటిస్తున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ ప్రధానంగా సాగుతుంది. 'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై.. అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ.. ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.


Click it and Unblock the Notifications











