బుల్లి తెరపై కాజల్ హల్ చల్
'మగధీర' చిత్రం గ్రాండ్ సక్సెస్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన తార కాజల్ బుల్లితెర పై కూడా తన హవాను చూపించింది. ఈ సినిమాలో ఇందు, మిత్రవిందగా రెండు రకాల షేడ్ లను అద్భుతంగా పోషించిన కాజల్ కు సినిమా అవకాశాలతో పాటు వాణిజ్య ప్రకటనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 'బిగ్ సి' వంటి సెల్ ఫోన్ షాపు ప్రకటనల్లో దర్శనమిచ్చిన కాజల్ తాజాగా ఈటీవీ ని ప్రమోట్ చేసే పనిలో పడింది. కాజల్ నటించిన ఈ ప్రకటన అన్ని ప్రముఖ ఛానళ్లో ప్రసారమవుతోంది. అంతే కాదు ఈ ప్రకటన కారణంగా ఈటీవీ టి.ఆర్.పి రేటింగ్ పెరిగిదట. మరి కాజలా!!! మజాకానా!!!


Click it and Unblock the Notifications











