రామ్ చరణ్ 'ఎవడు'లో ఆ స్టార్ హీరోయిన్ గెస్ట్
హైదరాబాద్: రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్ లో గతంలో మగధీర చిత్రం వచ్చి సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. అలాగే మూడో సారి వీరిద్దరి లక్కీ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఎవడు చిత్రంలోనూ ఆమెను గెస్ట్ గా తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు ఖరారు చేసారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.
ఈ విషయమై దిల్ రాజు మాట్లాడుతూ.. అవును..కాజల్ మా ఎవడు చిత్రంలో గెస్ట్ పాత్ర చేస్తోంది. ఆమె అల్లు అర్జున్ పాత్రకు పెయిర్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఆమె సీన్స్ షూటింగ్ జరుగుతుంది అన్నారు. ఇక ఎవడు చిత్రంలో అమీ జాక్సన్, సమంత హీరోయిన్స్ గా చేస్తున్నారు. వీరిద్దరూ రామ్ చరణ్ పాత్రకు హీరోయిన్స్ గా కనపిస్తారు.
ఇక 'బిజినెస్ మేన్' సినిమాతో మళ్లీ తన పూర్వ వైభవం సంపాదించుకున్న కాజల్ వరసగా తెలుగు, తమిళంలో అవకాశాలు అందుకొంటోంది. కాజల్ రీసెంట్ గా ఓ హిందీ చిత్రం కమిటైంది. ఆ చిత్రం కాన్సెప్ట్ వాస్తవ సంఘటన నేపధ్యంలో రూపొందిస్తున్నారు. 1987 నాటి ఒక వాస్తవ ఘటన ఆధారంగా 'ఎ వెన్స్‌డే' ఫేం దర్శకుడు నీరజ్ 'స్పెషల్ ఛబ్బిస్' పేరిట ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ముంబైలోని త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జువెలర్స్ ఒపెరా హౌస్ శాఖపై పట్టపగలు జరిగిన ఒక దోపిడీ ఘటన ఈ చిత్రానికి ఇతివృత్తమని తెలిసింది. సిబిఐ ఆఫీసర్ ముసుగులో మోన్ సింగ్ అనే వ్యక్తి 26 మంది సాయంతో ఈ దోపిడీకి పాల్పడ్డాడు.
ప్రస్తుతం కాజల్ తెలుగు సినిమా స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ, పవన్ కళ్యాణ్ లోనూ, కోలీవుడ్ స్టార్స్ సూర్య, విజయ్‌లతో ఈ ఉత్తరాది భామ ఒక్కో సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలోనూ ఆమె ఆచి తూచి ఆఫర్స్ ని ఎంచుకుంటోంది. ''నా అందాల ప్రదర్శన ఎప్పుడూ హద్దుల్లోనే ఉంది. చిన్ని చిన్ని దుస్తుల్లోనే గ్లామర్ ఉంటుందని నేను నమ్మను. అవి వేసుకోకపోయినా నేను అందంగానే ఉంటాను. నిండైన చీరకట్టులో చాలా సినిమాల్లో కనిపించాను. నా అందంపై నాకెప్పుడూ సందేహం లేదు. అనుమానం ఉన్నవారే వేరే దారుల్లో ప్రయాణిస్తారు'' అంటోంది కాజల్.


Click it and Unblock the Notifications











