కాస్టింగ్ కౌచ్ పై కాజల్ మాట.. ముందు మగాళ్లకు నేర్పండి!
శ్రీరెడ్డి వ్యవహారం, కాస్టింగ్ కౌచ్ వివాదం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో సంచలనంగా మారుతోంది. శ్రీరెడ్డి, మాధవి లతా వంటి వంటి నటీమణులు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. తాజగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు కాస్టింగ్ కౌచ్ కు సంబందించిన ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది.
తన అదృష్టం కొద్దీ అలాంటి చేదు అనుభవాలు నాకు ఎదురు కాలేదు. అసలు కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఉందొ లేదో కూడా తెలియదు అని కాజల్ వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలకు జాగ్రత్తలు చెప్పడం కంటే మగాళ్లకు ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి అని కాజల్ అగర్వాల్ బదులిచ్చింది.

గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదని వెల్లడించిన సమయంలో శ్రీరెడ్డి తీవ్రమైన విమర్శలు చేసింది. కాజల్ అగర్వాల్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











