వేశ్య పాత్రలు వేయడానికి కూడా సిద్దం అంటున్నా జూ ఎన్టీఆర్ హీరోయిన్...
'టాలీవుడ్ ఎంతో విశాలం. ఎంతమంది వచ్చినా ఇక్కడ స్థానం లభిస్తుంది. కాకపోతే మంచి పాత్రలు చేసే అవకాశం వచ్చి, అదృష్టం కూడా తోడుంటే సినిమాలు 'క్లిక్" అయ్యి మంచి స్థానం సంపాదించుకుంటారు. లేకపోతే వచ్చినంత వేగంగా వెళ్లిపోతారు" అంటున్నారు కాజల్ అగర్వాల్. మంచి పాత్రలు వరించడంతో పాటు, తన కృషి కూడా తోడవ్వడంవల్లే టాలీవుడ్ లో నిలదొక్కుకోగలిగానని ఈ బ్యూటీ అన్నారు. నటిగా తనని తాను నిరూపించుకోవడానికి కృషి చేస్తున్నానని చెబుతున్న కాజల్ తో 'నరసింహ"లో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి, 'వేదం"లో అనుష్క పోషించిన వేశ్య పాత్రల్లాంటివి చేస్తారా? అన్నప్పుడు 'తప్పకుండా చేస్తాను అన్నారు.
నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయడం ఒక సవాల్ లాంటిది. ఆ సవాల్ ఎప్పుడొచ్చినా ఎదుర్కోడానికి నేను సిద్ధమే" అన్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్..ఇలా ఎవరి సరసన చేసినా వారితో కాజల్ కెమిస్ట్రీ బాగుంటుంది. అది ఎలా సాద్యం అంటే 'హీరోలతో నా కెమిస్ట్రీ బాగుండటం కోసం నేను ప్రత్యేకంగా ఏమీ చేయడంలేదు. ఇద్దరు సిన్సియర్ ఆర్టిస్టులు కలిసి ఒక సీన్ లో నటిస్తే కచ్చితంగా ఆ సీన్ పండుతుంది. ఇప్పటివరకు నా కాంబినేషన్ లో నటించిన హీరోలందరూ టాలెంటెడే. వారితో పోటీ పడి యాక్ట్ చేస్తాను కాబట్టి సీన్ బాగా వస్తుంది" అన్నారు కాజల్ అగర్వాల్.


Click it and Unblock the Notifications











