twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ కు కాజల్ 'నో'!

    By Staff
    |

    Kajal
    మగధీర తర్వాత 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోతున్న చిత్రానికి సంభందించి రోజుకో వార్త వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో నటించడానికి మగధీరలో 'మిత్రవింద'గా అందరి అభినందనలూ అందుకొంటున్న కాజల్ నిరాకరించారట. జెనీలియా ప్రధాన నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా నటించడానికి కాజల్ ని సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించారట. ప్రస్తుతం మగధీరతో లైమ్ లైట్ లోకి వచ్చిన కాజల్ కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయట. దీంతో ఆమె సినిమాలను చాలా సెలెక్టివ్ గా ఎన్నుకుంటున్నారట. కాబట్టి అంతగా ప్రాధాన్యం లేని సెకెండ్ హీరోయిన్ గా నటించడానికి ఆమె ఒప్పుకోలేదట.

    దీంతో ఈ పాత్రకు 'బోణి' చిత్రం ద్వారా పరిచయమైన నాయిక 'కృతి' పేరును పరిశీలిస్తున్నారట. విశ్వసనీయ కథనం ప్రకారం ఇందులో చరణ్ ప్రేమ విఫలమైన యవకుడిగా నటిస్తున్నాడని సమాచారం. షూటింగ్ చాలా వరకు న్యూయార్క్ లో జరగనుంగదని త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X