పదహారేళ్ళ వయస్సులో కాజల్ మిడ్ నైట్ వ్యవహారం
అప్పుడు కాజల్ వయసు పదహారు. ఆ వయస్సలో ఆమె ఓ అర్ధరాత్రి దొంగతనందా ఓ సాహసం చేసానంటూ గతాన్ని గుర్తు చేసుకుంది ఆమె. ఆమె మాటల్లోనే...స్వీట్ సిక్స్‌టీన్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రపంచం అంతా కొత్తగా కనిపిస్తుంది. ఏదైనా సాధించేయగలమనే ధీమా ఉంటుంది. నాకూ అలానే ఉండేది. నాకు కారు నడపడం రాదు. కానీ ఎలాగైనా ట్రై చేయాలనే కోరిక ఉండేది. నా వేషాలు తెలిసిన మా నాన్నగారు కారు తాళాలు నాకు అందకుండా దాచేసేవారు. ఒక రోజు నా టైమ్ బాగున్నట్లుంది. నాన్నగారు తాళాలు దాయడం మర్చిపోయారు. నేను అవి పుచ్చుకుని నా స్నేహితులతో కలిసి అర్ధరాత్రి డ్రైవ్‌కి వెళ్లాను. ఆ రకంగా కారుని మా నాన్నకి తెలియకుండా దొంగిలించి, షికారు చేశాను. ఆ సంఘటన తల్చుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది అంటోంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్..ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రంలో చేస్తోంది. అలాగే ప్రభాస్ సరసన దశరధ్ దర్శకత్వంలోనూ, రామ్ చరణ్ సరసన మెరుపు చిత్రంలోనూ కమిట్ అయ్యింది.


Click it and Unblock the Notifications











