ఇలియానాని దెబ్బ కొడుతున్న కాజల్
వరసగా ఇలియానా ఆఫర్స్ అన్నీ కాజల్ తన్నుకుపోతోంది. 'కోటి"కి ఒక్క రూపాయి తక్కువైనా..సినిమా చేసేది లేదు" అంటూ భీష్మించుకు కూర్చోవడం ఇలియానా పాలిట శాపంగా మారింది. ఇదే సందర్భంలో పారితోషికం విషయంలో మరీ పట్టింపులకు పోకుండా..పట్టూవిడుపూ ప్రదర్శిస్తున్న కాజల్ ఏక కాలంలో మూడు నాలుగు సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఎన్టీఆర్‌తో 'బృందావనం"లో నటిస్తున్న కాజల్..నాగచైతన్య నటించే మూడో చిత్రంలోనూ, రామ్ చరణ్ తేజ్ నటించే నాలుగో చిత్రంలోనూ నటిస్తోంది. ఇక ఇలియానా ఒకే ఒక్క చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రం 'శక్తి". ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం అతనే హీరోగా నటిస్తున్న 'బృందావనం" తర్వాత విడుదల కానుంది. విక్రమ్ తో ఓ తమిళ చిత్రం, రామ్ తో ఓ తెలుగు చిత్రం ప్రకటితమె నప్పటికీ..కారణాంతరాల వల్ల ఆ రెండు చిత్రాలూ క్యాన్సిల్ అయ్యాయి. అలాగే విచిత్రంగా ఇలియానాను మొదట అనుకున్న వారంతా తర్వాత కాజల్ ని సంప్రదిస్తున్నారు. అలా రీసెంట్ గా మరో రెండు ఆఫర్స్ కాజల్ దగ్గరవటం ఇలియానాకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. అయితే ఏ మాయ చేసావె సమంతా వచ్చి వరస ఆఫర్స్ తో బిజి అవటంతో కాజల్ కి ట్విస్ట్ ఇచ్చినట్లు అయింది.


Click it and Unblock the Notifications











