ప్రేమలో మోసపోయా... బాధపడ్డాను: కాజల్
హైదరాబాద్: కాలేజి రోజుల్లో ఓ కుర్రాడిని ప్రేమించి మోసపోయానని నటి కాజల్ తెలిపారు. తమిళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కాజల్ అగర్వాల్ ఓ ఇంగ్లీష్ డైలీతో మనస్సు విప్పి మాట్లాడుతూ ఈ విషయం ప్రస్తావించారు. ప్రస్తుతం తమిళంలో కార్తీ సరసన బిరియాని చిత్రంలో నటిస్తున్నారు. అలాగే త్వరలో ఇళయ దళపతితో జిల్లా చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.
మీడియా వారు... మీ మనసు అంతగా గాయపడేలా ప్రేమ వ్యవహారాన్ని మీ జీవితంలో చూసారా? అని ప్రశ్నించగా ప్రేమలో పడడమనేది సాధారణ విషయమని తెలిపారు. అది చేదు అనుభవంగా మారినప్పుడు మనసు గాయపడుతుందని వెల్లడించారు. ఇందులో సిగ్గు పడాల్సిందేమీ లేదని, తాను కళాశాలలో చదివే రోజుల్లో సహ విద్యార్థి ప్రేమలో పడ్డానని తెలిపారు. ఆ ప్రేమ విషాదాన్నే మిగిల్చిందని వివరించారు.
ప్రేమను అనుభవించాలని, హద్దులు మీరవద్దని, భవిష్యత్, లక్ష్యం దృష్టి సారించాలని యుక్త వయస్సు అమ్మాయిలకు సలహా ఇచ్చారు. ముంబయిలో తనకు కొందరు క్లోజ్ ప్రెండ్స్ ఉన్నారని తెలిపారు. హిట్, ప్లాప్, బాద, మనస్తాపం వంటి సంఘటనలు ఎదురైనప్పుడు కాస్త ఓదార్పును ప్రతి ఒక్కరూ కోరుకుంటారని పేర్కొన్నారు. అన్ని షేర్ చేసుకోగలిగేలా తనకు మంచి మిత్రులను ఇచ్చినందుకు ఆ విషయంలో తాను భగవంతునికి ధాంక్స్ చెప్పుకుంటానన్నారు.
ఇక సినిమాపై అభిమానం ఉన్నంత మాత్రాన హీరోయిన్ అవడం సాధ్యం కాదన్నారు. ప్రతిభ, కృషి అవసరమని చెప్పారు. అప్పుడే ఏ భాషలోనైనా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందన్నారు. 'ఏ కారణంగాను నిన్ను నువ్వు తక్కువగా భావించరాదు' అని ఒకరు చెప్పిన సూక్తి చిన్నదైనా అదే తనను ఈ స్థాయికి చేర్చిందని వివరించారు.


Click it and Unblock the Notifications











