కమల్ సరనస కాజల్ ఎంపిక
హైదరాబాద్ : కమల్‌హాసన్‌తో కలిసి నటించే అవకాశం కాజల్‌కి దక్కిందని అంటున్నాయి చెన్నై సినీ వర్గాలు. ప్రస్తుతం కమల్ 'విశ్వరూపం 2' రూపొందిస్తున్నారు. ఆ తరవాత లింగుస్వామి నిర్మించే చిత్రానికి కమల్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తారు. ఇందులో హీరోయిన్ పాత్రకు కాజల్‌ని సంప్రదించినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రానికి యవన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. లింగుస్వామి నిర్మాతగా తిరుపతి బ్రదర్స్ బ్యానరుపై కమల్‌హాసన్ ఓ చిత్రంలో నటించనున్నాడు. దర్శకత్వం కూడా కమలే. 'విశ్వరూపం 2' ముగిశాక.. ఇది ప్రారంభమవుతుంది. దీని ద్వారా కమల్ చిత్రానికి తొలిసారిగా యువన్‌శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నాడు.
కమల్ మాట్లాడుతూ... ''నా సినిమాకు యువన్ సంగీతం సమకూర్చాలని చాలా రోజులుగా ఆశపడ్డా. అది లింగుస్వామి చిత్రం ద్వారా నెరవేరుతోంది. చాలా సంతోషంగా ఉన్నాను'' అని తెలిపారు.
ఇళయరాజా వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, కాస్త పాశ్చాత్యాన్ని మేళవించి.. యువతను ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా. 'తల' అజిత్ సినిమాలకు వరుసగా సంగీతం అందిస్తూ ఆస్థాన విద్వాంసుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు 'విశ్వనటుడు' కమల్‌హాసన్‌తో కలిసి పనిచేయనున్నాడు.


Click it and Unblock the Notifications











