'పేరు తేజ..టార్గెట్ రవితేజ' అని ఎవరు అంటారంటే..
తొలి ప్రయత్నమే ..'బాణం' వంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి అందరి ప్రశంసలూ అందుకున్న త్రీ ఏంజిల్స్ స్టూడియోస్ ప్రై.లి. తాజాగా 'ఓం శాంతి' అనే చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కధ చెప్పే విధానంలో వేరియోషన్ చూపుతూ ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ఐదు కథలు ఉంటాయి. ఆ కథలు..ఐదు జీవితాలను చెప్తాయి..వీటితో పాటు ఓ జీవిత సత్యం కూడా ఆవిష్కారమవనుంది అంటున్నారు నిర్మాతలు శేషు ప్రియాంక చలసాని. నూతన దర్శకుడు ప్రకాష్ ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రం లోగోను నిన్న(బుధవారం)చిత్రంలోని ప్రధాన తారాగణం ఆవిష్కరించారు. ఈ చిత్రంలో నవదీప్, కాజల్, నిఖిల్, బిందుమాధవి, అదితిశర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ మిగతా పాత్రల్లో మురళీమోహన్, రవికాలే, ప్రగతి, రోహిత్ పాఠక్, సునీల్, రఘుబాబు తదితరులు నటించారు.
ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ "ఇందులో నా పేరు ఆనంద్. కాలేజీ దాటగానే మంచి ఉద్యోగం. వారాంతంలో క్లబ్, పబ్. అంతా హ్యాపీలైఫ్. ఓ కష్టం ఎదురైనప్పుడే తెలిసింది సుఖం విలువ ఏమిటో" అన్నారు. "ఏదైనా పక్కాగా, ప్రణాళికబద్ధంగా ఉండాలనుకొనే పాత్ర నాది. పేరు అంజలి" అని చెప్పింది అదితిశర్మ. మరో నాయిక బిందుమాధవి మాట్లాడుతూ "నా పేరు నూరి. నా కథేమిటో తెర మీదే చూడాలి" అన్నారు. నిఖిల్ తన పాత్ర గురించి చెబుతూ "పేరు తేజ. టార్గెట్ రవితేజ" అన్నారు. "ఇందులో నేనే హీరోయిన్ ని అనుకొంటే మరో ఇద్దరు ఉన్నారు. నా పేరు మేఘన" అంటూ నవ్వేసింది కాజల్. 'ఓంశాంతి'లోని పాటలు ఈ నెల 27న విడుదలవుతాయి. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: నాగరాజు గంధం. ఇక క్రిష్ దర్శకత్వంలో వస్తున్న వేదం కూడా ఇదే తరహా నేరేషన్ లో రానుందని సమాచారం.


Click it and Unblock the Notifications











