ఏం జరుగుద్దో :తెలంగాణా బంద్ మీద కాజల్ కామెంట్
హైదరాబాద్ : కాజల్ ఎప్పుడూ నోరు జారి ఇరుక్కోవటం జరగలేదనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్ ఎక్కడికి దారి తీస్తుందో అని ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా గురువారంనాడు సమ్మె జరుగుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణా బంద్ ని ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.
కాజల్ ట్వీట్ చేస్తూ... "రాజకీయ బంద్ లు వద్దు... కొత్త ప్రభత్వాలకి ఆదాయం,సమయం దండుగ తప్పించి మరేమీ ఉపయోగం ఉండదు ...". అనే అర్దం వచ్చేలా ఆమె తెలంగాణ్ బంద్ ని ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు తెలంగాణా వాదులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్)లో కలుపుతూ రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ తెలంగాణలో గురువారం ఉదయమే బంద్ ప్రారంభమైంది. ఆర్డినెన్స్‌కు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమతి (తెరాస) బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌ను విజయవంతం చేయడానికి తెరాస నాయకులు, కార్యకర్తలు గురువారం తెల్లవారు జామునే బస్సు డిపోల ముందు ధర్నాలకు, ప్రదర్శనలకు దిగారు. తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరుగుతోందని డిజిపి ప్రసాద రావు చెప్పారు.

కాజల్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా గోవిందుడు అందరివాడే చిత్రంలో చేస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...రామ్‌చరణ్ కాంబినేషన్‌తో నేను చేసిన సినిమాలన్నీ ఆడాయి. అంటే మా కాంబినేషన్‌ను జనం ఇష్టపడుతున్నారు. అతనితో కలిసి మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ఇప్పుడు మరోసారి చరణ్‌తో కృష్ణవంశీ డైరెక్షన్‌లో చేస్తున్నా. ఇందులో కాస్త రెబల్‌గా ఉండే కేరక్టర్ చేస్తున్నా. అది నాకు బాగా నచ్చింది. అలాగే అది నైస్ ఇంటరెస్టింగ్ స్టోరీ. అందులో భాగం కావడం ఆనందంగా ఉంది అంది.
ఇక "పారితోషికం సమస్య వల్ల తెలుగులో గ్యాప్ తీసుకున్నాననేది కేవలం రూమర్. పారితోషికం అనేది నాకెప్పుడూ సమస్య కాలేదు. నా పారితోషికంతో నిర్మాతలెవరూ ఇబ్బంది పడలేదు. అలా అయితే నేను తమిళంలో బిజీగా ఉండేదాన్ని కాదు కదా. తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం'' అని చెప్పింది కాజల్ అగర్వాల్.


Click it and Unblock the Notifications











