twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు చాలా సైలెంట్..తక్కువగా మాట్లాడుతాడు...?!

    By Sindhu
    |

    హాట్ అండ్ టేలెంట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన త్వరలో రాబోతున్న 'బిజినెస్ మాన్" చిత్రంలో నటిస్తుంది. ఈ సందర్భంలో ఆమె మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'మహేష్ చాలా సైలెంట్. అతను ఎక్కువగా మాట్లాడాడు. ఒకవేళ ఏదైనా మాట్లాడినా అది మూవీకి సంబంధించిన విషయమై ఉంటుంది. అతని సలహాలు సూచనలు నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అంటోంది కాజల్.

    ఈమె ప్రస్తుతం 'బిజినెస్ మాన్" చిత్రం లో నటిస్తోంది. అంతేకాదు రామ్ చరణ్ తేజ్ కొత్త చిత్రంలో కూడా కాజల్ నటించటం దాదాపు ఖాయమైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో 'బిజినెస్ మాన్" చిత్ర షూటింగ్ శరవేఘంగా జరుగుతోంది. మహేష్ - కాజల్ పై కొన్ని పాటలు చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ త్వరలో యూరప్ కు బయలుదేరనుంది.

    అలాగే తమిళంలో సూర్య హీరోగా రూపొందుతోన్న 'మాట్రాన్" తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల రష్యా వెళ్ళి వచ్చిందట. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా కాజల్ ఆ లొకేషన్ ని మర్చిపోలేకపోతోందట. ఇటీవల ఓ సందర్భంలో ఈ లొకేషన్ గురించి కాజల్ మాట్లాడుతూ 'షూటింగ్ కోసం ఎన్నో విదేశాలకు వెళ్ళాను. కానీ ఫస్ట్ టైమ్ 'మాట్రన్" కోసం రష్యా వెళ్ళాను. అక్కడ లొకేషన్స్ నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అసలు మరిచిపోలేకపోతున్నాను. టైమ్ కుదిరినప్పుడల్లా రష్యా వెళ్ళాలనుకుంటున్నాను" అని చెప్పింది.

    English summary
    Gorgeous beauty Kajal Aggarwal is working with Prince Mahesh Babu for the forthcoming movie, ‘The Businessman’. Kajal says while working with the Mahesh Babu that He is very silent guy who doesn’t talk much. “He speaks very little. And when he does speak, it is usually related to issues about the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X