మొహమాటం లేకుండా స్ట్రిక్ట్ గా చెప్పేస్తున్న కాజల్..?
బృందావనం, మిస్టర్ ఫర్ ఫెక్ట్ వంటి చిత్రాలతో బిజీ హీరోయిన్ అయిపోయిన కాజల్ ఇటీవల రిలీజ్ అయిన వీర డిజాస్టర్ అయినప్పటికీ తన కెరీర్ కి ఎలాంటి ఢోకా లేదని ధీమాగా చెప్తోంది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో క్షణం తీరక లేకుండా వున్న కాజల్ కు రూమర్స్ బెడద ఎక్కువైపోయింది. నాగచైతన్య హీరోగా నటించబోతున్న చిత్రంలో కాజల్ బికినీలో కనిపించబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే...
ఓపక్క కాంపిటీషన్ తట్టుకోవడానికి తన సహచర తారలంతా బికినీకి కూడా 'రెడీ' అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చేసి, అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే... కాజల్ అగర్వాల్ మాత్రం 'చచ్చినా నేను బికినీ వేయను' అంటోంది. అసలు తననెవరూ ఇంతవరకూ బికినీ వేసుకోమని అడగనూ లేదట. ఒకవేళ అడిగినా మరో ఆలోచన లేకుండా వెంటనే 'నో' చెప్పేస్తానంటోంది. 'అసలు బికినీ నాకు సూట్ అవ్వదు. దానికి తోడు ఆ వస్త్రధారణ నాకు నచ్చదు. అందుకే ఎవరైనా అడిగితే సారీ చెప్పేస్తాను. కావాలంటే సినిమా కూడా వదులుకుంటాను కానీ, బికినీ మాత్రం వేయను" అంటూ స్ట్రిక్ట్ గా చెబుతోంది కాజల్. గ్లామర్ గా కనిపించాలంటే బికినీ వేసుకోవాల్సిన అవసరం లేదంటోంది.


Click it and Unblock the Notifications











