ఆ మాటల్లో నిజం లేదని ఖండించిన కాజల్...?
తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా మంచి డిమాండ్‌ని ఏర్పరచుకున్న భామ కాజల్ అగర్వాల్. ఈ భామ ఈ మధ్య రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవ్‌గన్ కథానాయకుడిగా నటించిన 'సింగం" చిత్రంతో బాలీవుడ్ కు పరిచయమైన విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి ఈ ఏదాది బాలీవుడ్ లో విడుదలైన సూపర్‌హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దాంతో ఈ చిత్రంలో కథానాయకగా నటించిన కాజల్ అగర్వాల్ కోసం బాలీవుడ్ దర్శకనిర్మాతలంతా క్యూ కడుతున్నారట. అయితే ప్రస్తుతం తెలుగు ప్రాజెక్టులతో బిజీగావున్న కాజల్ బాలీవుడ్ లో వస్తున్న అవకాశాలని అందిపుచ్చుకోవాలన్న ఆసక్తి చూపిస్తూనే కండీషన్స్ పెడుతోందట. దానికి కారణం కాజల్ బికినీ ధరించడానికి ఆసక్తి చూపిస్తోందని బాలీవుడ్‌లో ప్రచారం జరగడమే. ఈ విషయమై కాజల్ స్పందిస్తూ' నేను బికినీ ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నాని ప్రచారం జరుగుతోంది.
ఆ వార్తల్లో ఎలాంటి నిజంలేదు. అలా నటించడం నాకు ఇష్టం వుండదు అలాంటి పాత్రలు ఆఫర్ చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను" అంటూ వివరణ ఇచ్చింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు హీరోగా పూరీజగన్నాధ్ రూపొందిస్తున్న 'ది బిజినెస్ మేన్" చిత్రంతో పాటు తమిళ్‌లో సూర్య కథానాయకుడిగా కె.వి.ఆనంద్ రూపొందిస్తున్న 'మావూటన్" చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











