twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాంట్రావర్శిపై కాజల్ వివరణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : కాజల్‌ ఇటీవల హైదరాబాద్‌లో హిందీ చిత్రం 'స్పెషల్‌ చబ్బీస్‌' ప్రచార కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె - తమిళం కంటే తెలుగులోనే నటీమణికి విలువ ఎక్కువ అని చెప్పింది. ఈ అంశమ్మీద తమిళ సినీ జనాలు గుర్రుగా ఉన్నారు. విషయాన్ని గ్రహించిన కాజల్‌ వివరణ ఇస్తూ ''అన్ని భాషలూ నాకు ఒకటే. తెలుగు, తమిళ భాషలకు సమాన గౌరవం ఇస్తాను. త్వరలో రెండు తమిళ చిత్రాలు చేయబోతున్నాను'' అని చెప్పింది.

    అలాగే ''నటిగా చిత్రసీమలో ఎన్నో మంచి అనుభూతులున్నాయి. పలు భాషల్లో నటిస్తున్నాను. అయితే ఏది గొప్ప అని పోలికలు తీసుకురావడం అనవసరం. అయితే ఇందుకు సంబంధించి నేను చెప్పిన విషయాన్ని మరో అర్థంలో తీసుకొన్నారు కొందరు. నాకు తెలుగు, తమిళం సమానమే'' అంటూ చెప్పింది.

    తన సహ హీరోల్లో ఎన్టీఆర్‌ అంటే అభిమానం అని కాజల్‌ తెలిపింది. ''చిత్తశుద్ధి ఉన్న మంచి నటుడు. ఆయన స్నేహపూర్వకంగా ఉంటారు''అని చెప్పింది. 'నటన అంటే డైలాగులు అప్పజెప్పడం, కెమెరా ముందు అటూ ఇటూ నడవడం అనుకొనేదాన్ని. కథనీ, పాత్రనీ అర్థం చేసుకొని ప్రవర్తించడం అని అనుభవపూర్వకంగా తెలుసుకొన్నా'' అంది కాజల్‌. అలాగే నటిగా ఏం సాధించారు? అని అడిగితే'' అన్నింటికంటే ముఖ్యంగా ఎలా నటించాలో, ఎలా నటించకూడదో తెలుసుకొన్నా. నేనేం మోడలింగ్‌ నుంచి రాలేదు. ఇక్కడికి వచ్చే వరకూ కెమెరా ముందు ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదు. సినిమాలే ఒక్కోటీ నేర్పాయి అంది.

    ఇక నాపై ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా గురించి వస్తున్న రూమర్స్ ని ఎవరూ నమ్మొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తోంది కాజల్. దీపావళికి విడుదలైన 'తుపాకి' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం దీనిని హిందీలోకి రీమేక్‌ చేస్తున్నాడు దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌. అక్షయ్‌ కుమార్‌ హీరో. హీరోయిన్ గా కాజల్‌ పేరు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని కాజల్‌ కొట్టిపారేస్తూ ఆమె ఇలా స్పందించింది. 2012లో సూర్య సరసన 'బ్రదర్శ్‌', విజయ్‌తో 'తుపాకి' చిత్రాల్లో నటించి తమిళ, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన హీరోయిన్ కాజల్‌. ఒక సినిమా కాస్త నిరాశ పరిచినా.. రెండోది మాత్రం అమ్మడి స్థాయిని నిలిపింది.

    ఇక కాజల్ నటించిన 'నాయక్‌' ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతమైంది. ఈ 2013 వేసవిలో 'బాద్‌షా'తో వేడిక్కించనుంది. అంతేగాక వాస్తవ సంఘటన నేపధ్యంలో రూపొందుతున్న హిందీ చిత్రంలో కాజల్ చేస్తోంది. 1987 నాటి ఒక వాస్తవ ఘటన ఆధారంగా 'ఎ వెన్స్‌డే' ఫేం దర్శకుడు నీరజ్‌ 'స్పెషల్‌ ఛబ్బిస్‌' పేరిట ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ముంబైలోని త్రిభువన్‌ దాస్‌ భీమ్‌జీ జువెలర్స్‌ ఒపెరా హౌస్‌ శాఖపై పట్టపగలు జరిగిన ఒక దోపిడీ ఘటన ఈ చిత్రానికి ఇతివృత్తమని తెలిసింది. సిబిఐ ఆఫీసర్‌ ముసుగులో మోన్‌ సింగ్‌ అనే వ్యక్తి 26 మంది సాయంతో ఈ దోపిడీకి పాల్పడ్డాడు.

    English summary
    Kajal clarify that Tamil films and Telugu films are same. Kajal was recently available for comment regarding her career, and all she said was the actress is in talks with two big directors and is listening to their scripts in telugu and Tamil.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X