మొత్తానికి కాళ్ళ బేరానికి వచ్చిన హాట్ బ్యూటీ కాజల్
''నేను పంజాబీ అమ్మాయిని.నార్త్ బ్యూటీని. అంటే బాలీవుడ్ భామనే...సౌత్ సినిమాలు చేస్తున్నంత మాత్రాన నేను సౌత్ అమ్మాయిని అయిపోను కదా "" అంటూ బాలీవుడ్ మీడియా ముందు బిల్డప్ ఇచ్చి సౌత్ సినిమా పరిశ్రమకు కాలేలా చేసిన కాజల్ ఇప్పుడు మాట మార్చేసి కాళ్ళ బేరానికి వచ్చేసింది. ఆమె మీద అనీఫియల్ గా బ్యాన్ పెడతారనే వార్తలు వచ్చేసరికి ఆమె వెంటనే తన స్టేట్ మెంట్ ని వెనక్కి తీసుకుంటూ రివర్స్ గేర్ వేసింది.
వివాద విషయాన్ని ఖండిస్తూ ఆమె రీసెంట్ గా... నేను నార్త్ ఇండియన్‌ని అని చెప్పానంతే. అంతేకానీ సౌత్ సినిమాని చిన్న చూపు చూస్తూ నేను మాట్లాడలేదు. మాట్లాడను కూడా. కానీ అలా మాట్లాడినట్లు మీడియాలో రావడం నాకు బాధగా ఉంది. సౌతిండియన్ బ్యూటీగా పిలిపించుకోవడం అంటేనే నాకిష్టం. ఎప్పటికీ నేను సౌత్ హీరోయిన్‌నే ..అంతేగాక నా మీద బ్యాన్ పెడతారనే వార్తలు ప్రచారం చేసారు.నాకు చాలా బాధ వేసింది అంది. అంతేగాక 'సింగం" సినిమా పెద్ద విజయం సాధించినా... సౌత్ సినిమాను మాత్రం వదులుకోను అంది. జూలై 22న 'సింగం" విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











