కాజల్ మరోసారి, మరో మ్యాగజైన్ కి హాట్ ఫోటో షూట్..!?
కాజల్ అగర్వాల్ ఇటు ఫ్యాన్స్ ని అటు సినిమా ఇండస్ట్రీని మరోసారి షాక్ గురిచేస్తోంది. ముద్దుగుమ్మ కాజల్ ఇటీవల వివాదాలతో సహవాసం చేస్తోంది. ఎఫ్ హెచ్ఎమ్ మ్యాగజైన్ ముఖచిత్రం పై టాప్ పూస్ గా ఫోజిచ్చి ఈ సుందరి అందరినీ విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ ఫోటో తనదికాదని సదరు మ్యాగజైన్ వారు ఫోటోని మార్ఫింగ్ చేశారని ఆరోపించింది. మూడు కోట్ల రూపాయల భారీ మొత్తానికి కాజల్ ఫోటోషూట్ కు ఒప్పుకుందని బయటి నుంచి విమర్శలు వెల్లువతో ఫ్లేట్ ఫిరాయించిందని ఎఫ్ హెచ్ఎమ్ మ్యాగజైన్ వారు ప్రత్యారోపణ చేశారు.
ఇదిలా వుండగా తాజాగా ఈ సుందరి ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ సెప్టెంబర్ సంచికలో దర్శనమిస్తోన్న హాట్ ఫోటో షూట్ మరోసారి చర్చనీయాంశం అవుతోంది . వీపుభాగం మొత్తం కనిపించేలా ఈ భామ ఆ ఫోటోషూట్ లో కనువిందు చేస్తోంది. దీంతో కాజల్ ఫోటోల్ని మార్ఫింగ్ చేశారన్న వ్యాఖ్యల్ని ఎఫ్ హెచ్ఎమ్ మ్యాగజైన్ తిప్పికొడుతోంది.
ట్విట్టర్ లో వారు స్పందిస్తూ...'మా పత్రిక కవర్ పేజీపై కాజల్ చిత్రం మార్ఫింగ్ అయితే ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ ఫోటోషూట్ సంగతేంటి..మా పత్రికకు టాప్ లెస్ గా ఫోజిచ్చిన ఈ సుందరి ఫిల్మ్ ఫేర్ కు బ్యాక్ లెస్ గా ఫోజిచ్చిందంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. దీంతో తాజా ఫిల్మ్ ఫేర్ ఫోటో షూట్ పై కాజల్ ఏ విధంగా స్పందిస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











