Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కాజల్..ప్రివ్యూ వేసింది అందుకే
బాలీవుడ్ మెట్టు ఎక్కానన్న ఆనందంలో కాజల్ నోరు జారి సౌత్ పరిశ్రమలో చాలా మంది కోపానికి గురైన విషయం తెలిసిందే. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె తన పరిచయస్తులందరినీ పిలిచి ఈ చిత్రం ప్రివ్యూ గురువారం వేసింది. వచ్చిన వారితో ఆఫర్ వచ్చింది కాబట్టి చేసాను.నన్ను ఆదరించింది మీరే. తెలుగుకే నా ప్రాధాన్యం అని నొక్కి చెప్పి వారిని శాంతింప చేసే ప్రయత్నం చేసింది. అంతేగాక తనను కలిసిన మీడియాతో..నేననే కాదు...ఇప్పటి హీరోయిన్స్ అంతా కథకే ప్రాధాన్యమిస్తున్నారు. స్క్రిప్టు నచ్చితే సరిపోతోంది. ఏ భాషలో నటించడానికైనా సిద్ధమే అని చెప్పుకొచ్చింది.
అజయ్ దేవగణ్, కాజల్ జంటగా నటించిన చిత్రం 'సింగం'. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ప్రకాష్‌రాజ్ విలన్ గా చేసారు. గోవా, మహారాష్ట్ర సరిహద్దుల్లోని శివ్‌గఢ్ అనే చిన్న గ్రామం నేపథ్యంగా కథ సాగుతుంది. బాజీరావ్ సింగం అనే నిజాయతీపరుడైన పోలీసు అధికారికీ నేర ప్రవృత్తిగల రాజకీయ నాయకుడు జైకాంత్ షిక్రేకీ మధ్య ఏ విషయంలో గొడవ వచ్చింది? ఎవరు ఎవరి మీద పైచేయి సాధించారు? అనేది కథలో కీలకం. ఇక ఈ చిత్రం తెలుగు, తమిళంలో వచ్చిన యముడు(సింగం)చిత్రానికి రీమేక్.