పవన్, మహేష్, రాజమౌళిపై కాజల్ కామెంట్స్, అక్కా.... అని ఐలవ్యూ చెబుతావేంటి?
Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన హీరోయిన్ కాజల్ ఇపుడు కాస్త డౌన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాజల్ నాని నిర్మాతగా తెరకెక్కుతున్న 'అ!' చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.

‘అ!' స్టార్లపై కాజల్ అభిప్రాయాలు
ప్రియ దర్శి: బ్రిలియంట్
నిత్యా మీనన్: టాలెంటెడ్
కాజల్ అగర్వాల్: ‘అ!'
నాని : పవర్ హౌస్
రెజీనా: వెరీ రిస్క్ టేకింగ్
అవసరాల శ్రీనివాస్: టాల్
ఈషా : బ్యూటిఫుల్

రవితేజ, పవన్, మహేష్, రాజమౌళిపై
రవితేజ: మల్టీ డైమన్షనల్
రాజమౌళి: హి ఈజ్ ది అల్టిమేట్ డైరెక్టర్ ఎవర్
అనుష్క: గార్జియస్
మహేష్ బాబు: హ్యాండ్సమ్
ప్రభాస్: బాహుబలి
పవన్ కళ్యాణ్: ఎవ్రీవన్ స్వీట్ హార్ట్

కాజల్ అక్కా అంటూ...
‘అ!' ప్రీ రిలీజ్ వేడుకలో కాజల్ తో మాట్లాడే అవకాశం కొందరు అభిమానులకు దక్కింది. ఓ ఫ్యాన్ మైక్ అందుకుని కాజల్ ను ఉద్దేశించి 'అక్కా' అని సంబోధించాడంతో అంతా ఆశ్చర్యపోయారు.

ఎవడ్రా వాడు.... అంటూ యాంకర్ రవి కామెడీ
‘అక్కా' అనే మాట విని యాంకర్ రవి కల్పించుకుని.... ఎవడ్రా వాడు, కాజల్‌ను అక్క అంటున్నాడు.... ఏడున్నవ్ బావా అంటూ ఫన్ క్రియేట్ చేశాడు. రవి కామెడీతో ఆడిటోరియం మొత్తం కేరింతలతో మార్మోగిపోయింది.

అక్కా.... అని ఐలవ్యూ చెబుతావేంటి?
కాజల్‌ను అక్కా అని సంబోధించిన సదరు అభిమాని 'ఐ లవ్ యూ' అని చెప్పి ఇంకో షాక్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన కాజల్ ఓ వైపు 'అక్కా' అంటూ, మరోవైపు 'ఐ లవ్ యూ' ఎలా చెబుతావ్.... అంటూ ఎదురు ప్రశ్నించింది. దీంతో యాంకర్స్ కల్పించుకుని ఒక సోదరిగా మీకు ఐ లవ్ యూ చెప్పాడు అని హిట్ ఇవ్వగానే..... మీకు తప్పకుండా రాఖీ కడతాను అంటూ కాజల్ అందరి ముఖాల్లో నవ్వులు పూయించింది.


Click it and Unblock the Notifications











