కాజల్ కి హీరోలతో మంచి రాపో ఉండబట్టే...
సాధారణంగా ఆర్టిస్టుల మధ్య మంచి రాపో ఉంటే కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. అలాగే హీరో, హీరోయిన్ ఇద్దరూ మంచి ఆర్టిస్టులు అయ్యుండి వారి మధ్య రాపో బాగున్నప్పుడే కెమిస్ట్రీ బాగా పండుతుంది..నేను ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా. అందుకే ఏ హీరో ప్రక్కన చేసినా తెరపై కెమిస్ట్రీకి లోటుండదు అంటోంది కాజల్ అగర్వాల్. ఆమె తెరపై హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ పండించే విధానం గురించి చెపుతూ ఇలా స్పందించింది. అలాగే..నేను టాలెంట్ ఉన్న హీరోలతో చేయడం వల్ల వారితో నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతోంది.ఆ హీరోలు కూడా రెండో సినిమా చేయడానికి కూడా అవకాశం ఇస్తున్నారు. బయట కూడా హీరోలందరితో మీ కెమిస్ట్రీ బాగుంటుదని చాలా మంది అంటుంటారు. ఆ మాటలు విన్నప్పుడు చాలా హ్యాపీ ఫీలవుతూంటాను...అంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రంలో చేస్తోంది.అలాగే నాగచైతన్య సరసన అజయ్ భుయాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలోనూ ఆమె చేస్తోంది. రామ్ చరణ్ మెరుపు నుంచి డేట్స్ లేవని తప్పుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ చిత్రం చేస్తోంది. అలాగే హిందీలో యముడు రీమేక్ కూడా కమిటయ్యినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











