వరస ప్లాప్ లపై కాజల్ కామెంట్
ప్లాప్ లు వచ్చిన సమయంలోనే నిబ్బరంగా ఉండాలి. మన సినిమా ఆడలేదంటే మన నుంచి ప్రేక్షకులు ఇంకా వేరేదో ఆశిస్తున్నారని అర్థం చేసుకోవాలి. అందుకు తగ్గట్టు కృషి చేయాలి.ప్లాప్ వచ్చిందే అని ఏడుస్తూ కూర్చొంటే మాత్రం మనకు మనమే వెనకబడ్డట్టు లెక్క. పరిశ్రమలో జయాపజయాలు సాధారణం. అయితే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ ఆపకూడదు అంటోంది కాజల్. ఆ మధ్యన ఆమె నటించిన వీర,దడ చిత్రాలు వరసగా పరజయాన్ని చవిచూసాయి. దాని నుంచి కోలుకుని ఆమె మహేష్, రామ్ చరణ్ చిత్రాల్లో ఆఫర్స్ సంపాదించింది. ఈ విషయమై మీడియా వారు ఆమెను అడిగినప్పుడు ఇలా స్పందించింది. ప్రస్తుతం ఆమె మహేష్‌బాబుతో కలిసి చేస్తున్న 'బిజినెస్ మేన్' సంక్రాంతి విడుదలకు రెడీ అవుతోంది.
బిజినెస్ మ్యాన్ విషయానికి వస్తే..."ఇలా రౌండప్ చేసి కన్ఫూజ్ చేయొద్దు.. ఎందుకంటే కన్ఫూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను" అంటూ మహేష్ చెప్పే డైలాగుతో ఈ చిత్రం టీజర్ విడుదలైంది. తనని రౌండప్ చేసిన రౌడిలను చూస్తూ ఈ డైలాగు చెప్తాడు. ఆ తర్వాత వాళ్లను చావకొడ్తాడు. ఇక ఈ టీజర్ చూసిన వారంతా సినిమా ఓ రేంజిలో ఆడుతుంది. పోకిరి రికార్డులుని, దూకుడు సంచలాన్ని దాటేస్తుంది అంటున్నారు.
ఇక ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం.. కొనుగోళ్ళు.. అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు. గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం హిందీ వెర్షన్ ని కూడా పూరి రెడీ చేస్తున్నారు.హిందీ వెర్షన్ లో అబిషేక్ బచ్చన్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











