నా హీరోలందరూ టాలెంటెడే అందుకే...కాజల్
ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ప్రభాస్.. ఇలా ఎవరి సరసన చేసినా వారితో నా కెమిస్ట్రీ బాగుంటుంది. అయితే ఆ హీరోలతో నా కెమిస్ట్రీ బాగుండటం కోసం నేను ప్రత్యేకంగా ఏమీ చేయడంలేదు. ఇద్దరు సిన్సియర్ ఆర్టిస్టులు కలిసి ఒక సీన్‌లో నటిస్తే కచ్చితంగా ఆ సీన్ పండుతుంది. ఇప్పటివరకు నా కాంబినేషన్‌లో నటించిన హీరోలందరూ టాలెంటెడే. వారితో పోటీ పడి యాక్ట్ చేస్తాను కాబట్టి సీన్ బాగా వస్తుంది అని అంటోంది కాజల్ అగర్వాల్. అలాగే తాను నరసింహ లో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి, వేదం లో అనుష్క పోషించిన వేశ్య పాత్రల్లాంటివి చేస్తానని... కాకపోతే ఆ పాత్రను దర్శకుడు సరిగ్గా చూపించగలుగుతారు అని నమ్మినప్పుడు, అది కథకు కీలకమైన పాత్ర అనే నమ్మకం కుదిరినప్పుడు ఒప్పుకుంటా. నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయడం ఒక ఛాలెంజ్ లాంటిది. ఆ ఛాలెంజ్ ఎప్పుడొచ్చినా ఎదుర్కోడానికి నేను సిద్ధమే అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ఆమె నటించిన బృందావనం చిత్రం విజయవంతంగా ఆడుతోంది. ప్రసుత్తం ఆమె ప్రభాస్ సరసన ఒక సినిమా, రామ్‌చరణ్‌తో మెరుపు , రవితేజతో వీర, నాగచైతన్యతో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉంది


Click it and Unblock the Notifications











