twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీర నా జీవితం మార్చేసింది

    By Srikanya
    |

    మగధీరకు ముందు నేను వేరు. మగధీర తర్వాత నేను వేరు. అంతగా నా జీవితంపై ప్రభావం చూపించిన పాత్ర అది.మిత్రవింద నా జీవితాన్ని సమూలంగా మార్చేసిన పాత్ర అంటోంది కాజల్. ఆమెను మగధీర బాలీవుడ్‌లో రీమేక్ ని రిజెక్టు చేసారట కదా అని అడిగితే దానికి సమాధానంగా ఆమె ఇలా స్పందించింది. మగధీర చిత్రం త్వరలో బాలీవుడ్‌లో రీమేక్ కాబోతోందని, హృతిక్‌రోషన్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో మిత్రవింద పాత్రకు తెలుగులో చేసిన కాజల్ పేరునే సదరు దర్శక, నిర్మాతలు ప్రతిపాదించారని, అయితే... ఆ పాత్రను కాజల్ సున్నితంగా తిరస్కరించారని ఈ మధ్య ఓ వార్త బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది.

    అలాగే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏ అవకాశం వచ్చినా వదులుకోను. ఆయా పాత్రలు నచ్చకపోతే తప్ప అంది.ఆ పాత్ర మళ్లీ చేసే అవకాశం వస్తే... అదికూడా బాలీవుడ్‌లో, పైగా నా అభిమాన నటుడు హృతిక్‌కి జోడీగా.. ఇక అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. టాలీవుడ్‌తో పాటు, కోలీవుడ్, బాలీవుడ్‌లలో కూడా మంచి పేరు సంపాదించాను. ఇంకా ఇంకా ఎదగాలనేది నా డ్రీమ్. గ్లామర్ ఉన్నంతవరకూ నటించాలనేది నా అభిమతం కాదు. నటిగా కొనసాగినంత వరకూ గ్లామర్ మెయిన్‌టెయిన్ చేయాలనేది నా కోరిక. అందుకోసం శాయశక్తులా కృషి చేస్తా అని చెప్పుకొచ్చారు కాజల్.

    అయితే అంతకుముందు "మగధీర" ని హిందిలో రీమేక్ చేస్తే ఏ హీరోతో చేయాలి అని అందులో నటించిన హీరోయిన్ కాజల్ ని మీడియావారు అడగటం జరిగింది. దానికామె స్పందిస్తూ..చాలా మంది బాలీవుడ్ నటులకు ఆ పాత్ర చేయటానికి పొటిన్షియల్ ఉంది. మగధీర లో ఆ పాత్రకి చాలా హీరోయిజం, బాడీ లాంగ్వేజ్ అవసరం. నాకయితే సల్మాన్ అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను అంది తెలివిగా. బాలీవుడ్ లో సెటిల్ కావటానికి సల్మాన్ ఖాన్ తో జోడి అయితే బెస్ట్ అనుకున్న ఆమె ఇలా అన్నదని ఇది విన్న వారనుకున్నారు.ఇప్పడు హృతిక్ రోషన్ పాట పాడుతోంది.

    English summary
    Kajal Agarwal said, "I am currently shooting with Surya in Chennai for the Tamil film, Maatraan. Then I will start work for Puri Jagannath's The Businessman in Telugu with Mahesh Babu (actor). I've received loads of offers in Hindi. But I haven't zeroed in on any."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X