‘మగధీర’ హిట్ సరే..మిగతావాటి సంగతేంటి? కాజల్
'మగధీర" విజయాన్నే తలచుకుంటూ కూర్చుంటే మిగిలిన సినిమాల సంగతే మిటంటోంది కాజల్. తన దృష్టిలో ప్రతి సినిమా కూడా 'మగధీర" చిత్రం కన్నా విజయం సాధించాలని కోరుకుం టానంటోంది. త్వరలో విడుదల కాబోయే 'బృందావనం" తోపాటు రామ్ చరణ్‌తేజ్ చిత్రం 'మెరుపు" కూడా కెరీర్‌పరంగా తనకు మంచి పేరు తెస్తాయని చెప్తోందిది. అలాగే ఎప్పటికి ఎవరు హిట్ కొడితే వారే నంబర్ వన్ స్థానంలో ఉంటారనేది తన ధీరీ అంటోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఒక చిత్రం కొన్ని కారణాల వలన బాగా ఆడివుండకపోవచ్చు. ఆ చిత్రాల్లో కూడా ఒక్కోసారి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసే అవకాశం ఉంటుంది. తాము నటించిన చిత్రాలలో తమ పాత్రలు సంతృప్తికరంగా చేశామా లేదా అన్నదే ముఖ్యం..జయాపజయాలతో పెట్టుకుంటే ఎలా అని వేదాంతం చెప్తోంది. అలాగే ఒక సినిమా హిట్ అవ్వగానే నంబర్‌వన్ అని మరో సినిమా ఫ్లాప్ అనగానే ఫలానా హీరోయిన్ వెనకబడిపోయారని అంటుంటారు. వాటన్నింటిపై తనకు నమ్మకమే లేదని..అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు పోలేమని అంటోంది కాజల్.


Click it and Unblock the Notifications











