twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజంగానే క్రింద పడిపోయాను,దెబ్బలు బాగా తగిలాయి: కాజల్

    By Srikanya
    |

    ఆడేటప్పుడు నిజంగానే కింద పడిపోయేదాన్ని. దెబ్బలు కూడా తగిలాయి తెలుసా అంటోంది కాజల్.ఆమె రీసెంట్ గా 'వీర'చిత్రంలో కబడ్డి చిట్టిగా చేసింది. ఆ చిత్రం లో కబడ్డి ఆడిన విధానం గురించి చెబుతూ ఇలా స్పందించింది.అలాగే కబడ్డి ఆట గురించి అసలు నాకు దాని గురించి తెలీదు.'వీర' కోసమే ప్రత్యేకంగా నేర్చుకొన్నాను. నేను కబడ్డీ ఆడే సన్నివేశాలన్నీ రాజమండ్రిలో చిత్రీకరించారు. అమ్మో.. ఏం వేడి? అస్సలు తట్టుకోలేకపోయాను.

    ఇక దర్శకుడు రమేష్‌ వర్మ నా పాత్ర గురించి మొదటిసారి వివరించినప్పుడు 'లేడీ డాన్‌.. ఆడ రౌడీ ఇలాంటి లక్షణాలున్న అమ్మాయివి. పైగా కబడ్డీ ఆడాలి' అని చెప్పారు. వినగానే ఇదేదో తమాషాగా ఉందే అనిపించింది. అందుకే వెంటనే ఒప్పుకొన్నాను. పూర్తి మాస్‌ తరహా పాత్ర ఇది. కొంత మంది 'చాలా కొత్తగా కనిపించావు' అన్నారు. మరి కొంత మందికి చిట్టీ పడిన పాట్లు నచ్చలేదు. ప్రశంసనీ, విమర్శనీ రెండింటినీ స్వీకరించాను అంది.అయితే ఇంత కష్టపడి చేసిన పాత్ర భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.వీర చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.

    English summary
    Ravi Teja- Taapsee and Kajal starring 'Veera ' was released on 20th of May.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X