వావ్... కాజల్ లుక్ అదిరింది గురూ! (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ ఇటీవల ‘మెహందీ' అనే ఫెస్టివ్ మేగజైన్ కోసం జరిగిన ఓ ఫోటో పాల్గొంది. ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ కార్తీక్ శ్రీనివాసన్ నేతృత్వంలో ఈ హై ఫ్రొఫైల్ ఫోటో షూట్ నిర్వహించారు. ఈ ఫోటో షూట్‌కు ‘క్వీన్ ఆప్ హార్ట్స్' పేరుతో సాగిన ఈ ఫోటో షూట్ మెహందీ వెడ్డింగ్ మేగజైన్ 3వ యానివర్సరీ సందర్భంగా కవర్ పేజీపై ప్రచురించారు. కాజల్ అగర్వాల్ క్వీన్ లుక్ తో అభిమానుల మతి పోగొట్టింది. ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇక కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికొస్తే... తెలుగులో చివరగా ‘టెంపర్' చిత్రంలో నటించిన కాజల్ ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీ అయిపోయింది. ధనుస్ హీరోగా వస్తున్న ‘మారి', విశాల్ కు జోడీగా ‘పాయుమ్ పులి' చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రం కూడా చేస్తోంది. దీంతో పాటు ఓ హిందీ చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది.

Kajal The 'Queen of Hearts' look

మరో వైపు విజయ్-కాజల్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘జిల్లా' త్వరలో తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఆర్‌.బి.చౌదరి సమర్పణలో ప్రసాద్‌ సన్నిధితో కలిసి యువ నిర్మాత తమటం కుమార్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగులోనూ ఈచిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు. తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్‌ సన్నిధి మాట్లాడుతూ.. ''ఆర్‌.బి.చౌదరి వంటి లెజండరీ ప్రొడ్యూసర్‌ సమర్పణలో 'జిల్లా' చిత్రాన్ని తెలుగులో అనువదించే అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ కోసం ఎందరో టాప్‌ ప్రొడ్యూసర్స్‌ పోటీ పడినప్పటికీ.. మాలాంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యం, మరియు మా మీద గల నమ్మకంతో 'జిల్లా' తెలుగు హక్కులు మాకు ఇవ్వడమే కాకుండా.. ఈ చిత్రాన్ని తెలుగులో మాతో కలిసి సమర్పించేందుకు పెద్ద మనసుతో అంగీకరించిన ఆర్‌.బి.చౌదరిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. డా॥బ్రహ్మానందం, ఎల్‌.బి.శ్రీరాం, సురేఖావాణి తదితరులపై తెలుగు వెర్షన్‌ కోసం కొన్ని సన్నివేశాల్ని ప్రత్యేకంగా చిత్రీకరించినట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X