బాలాజీ దయతో ‘బిజినెస్‌మేన్’ హిట్టవ్వాలని
''మా ప్రయత్నం మేం చేశాం. ఇక మిగిలింది ఆయన వంతే కదా..అందుకే తిరుపతికి వచ్చాను'' అని చెప్పింది కాజల్. ఆమె తాజా చిత్రం 'బిజినెస్‌మేన్'ఈ వారంలో విడుదల అవుతోంది. వరస ఫ్లాపుల్లో ఉన్న కాజల్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెటుటుకుంది. దాంతో ఆమె తిరుపతి వెళ్లి మ్రెక్కుకుంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే..''నా ఫేవరెట్ గాడ్ బాలాజీ. ఎప్పట్నుంచో తిరుమల రావాలనుకున్నాను. కానీ, ఇన్నాళ్లకు కుదిరింది. బాలాజీ దయతో ఈ కొత్త ఏడాది సూపర్‌హిట్లు దక్కుతాయని నా నమ్మకం'' అని చెప్పుకొచ్చింది. అలాగే ఈ ప్రయాణం అయ్యాక ఆమె ట్విట్టర్ లో...బాలాజీ దర్శనం అయ్యింది తిరుమలలో...రిలాక్స్ గా ఫీలవుతున్నాను అని ట్వీట్ చేసింది.
ఇక మహేష్ బాబుతో తొలి సారి నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది.సెట్లో ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడైనా పెదవి విప్పితే అక్కడా సినిమా విషయాలే ఉంటాయి. చిన్న చిన్న సూచనలు చెబుతుంటారు. అవి నాకెంతో ఉపయోగపడ్డాయి అంటోంది కాజల్. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్, శ్రీనువైట్ల చిత్రంలో నటించటానికి కమిటైంది. తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇక మహేష్ సరసన ఆమె నటించిన 'బిజినెస్‌మేన్'చిత్రం ఈ శుక్రవారం విడుదల అవుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. దాంతో భారీ సంఖ్యలో ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 2011లో ఆమె నటించిన చిత్రాలు వరసగా ఫెయిల్యూర్ అవటంతో నిరాశలో ఉన్న ఆమె బిజినెస్ మ్యాన్ తో తన కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











