లెజెండ్స్ అనదగ్గ వారికే పరాజయాలు తప్పలేదు... నేనెంత..?
లెజెండ్స్ అనదగ్గ వారికే పరాజయాలు తప్పలేదు... నేనెంత? రెండు ఫ్లాపులు రాగానే నా పని అయిపోయిందని రాసేస్తున్నారు. ఇలా అయితే నా కెరీర్ ఏం కావాలి' అంటూ మీడియా ముందు వాపోయారు కాజల్ అగర్వాల్. వీర, దడ ఫ్లాపులతో కాజల్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడిందని, 'బిజినెస్‌మ్యాన్'పైనే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉందని ఇటీవల కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి.
దీని గురించి కాజల్ పై విధంగా స్పందించారు. 'అపజయాలు నాకు కొత్తేం కాదు. వాటిని చాలా లైట్‌గా తీసుకుంటాన్నేను. ప్రస్తుతం 'బిజినెస్‌మ్యాన్' చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదికాక వివి వినాయక్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయబోతున్నాను. తమిళంలో రెండు సినిమాలు, కన్నడంలో ఒక సినిమా ప్రస్తుతం నా ఖాతాలో ఉన్నాయి. పని అయిపోయిన కథానాయిక డైరీ ఇలాగే ఉంటుందా? కెరీర్ అప్‌లో ఉన్నప్పుడు ఎత్తేయడం... డౌన్ ఫాల్లో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి కథనాలను ప్రసారం చేయడం మీడియాకు పరిపాటైపోయింది. ఈరోజు చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి. 2012 నాది. అది రేపు మీరే చూస్తారు' అంటూ మీడియా ముందు ధీమాగా చెప్పారు కాజల్.
కాజల్, మహేష్ బాబు జంటగా నటిస్తున్ బిజినెస్ మ్యాన్ ప్రస్తుతం ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్ర డబ్బింగ్ శబ్దాలయ స్టూడియోలో జరుగుతుంది. ఈ చిత్రం లో తన పాత్ర కోసం కాజల్ తనే డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేసింది. తన పాత్రకి డబ్బింగ్ డబ్బింగ్ చెప్పాలని ఆసక్తి చూపడంతో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. డబ్బింగ్ బాగా వస్తే తనతోనే చెప్పించడం జరుగుతుంది. ఇంతకుముందే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సవిత రెడ్డితో డబ్బింగ్ చెప్పించారు. జనవరి 11న విడుదలవుతున్న ఈ చిత్రం ఆడియో ఈ నెల 22న విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











