»   » కాజల్ షార్ట్ ఫిలిం చూసారా: అద్బుతమైన మెసేజ్ తో...... (వీడియో)

కాజల్ షార్ట్ ఫిలిం చూసారా: అద్బుతమైన మెసేజ్ తో...... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన నటనతో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఈ హీరోయిన్ ఇప్పుడు కొత్త సందేశంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రక్త దానం (బ్లడ్ డొనేషన్‌) ప్రాధాన్యతను తెలిపే నేపథ్యంలో సాగే షార్ట్‌ఫిలింలో కాజల్ నటించింది. రెగ్యులర్ గా రక్త దానం చేయడం వలన కలిగే అధ్బుతమైన ఫలితాలు ఉంటాయనే సంగతి చాలామందికి తెలియదు.

సాధారణంగా రక్తదానం చెయ్యడం వలన ఒంట్లో శక్తి పోయి నీరసం వస్తుందని చాలామంది అనుకుంటారు. అందుకే రక్త దానం అనగానే దూరంగా ఉంటారు. ఇలాంటి అపోహలని దూరం చేసి రక్తదానం అవసరాన్ని జనాలకి అర్థం చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆ క్రమం లోనే శత్రఘ్న సిన్హా దర్శకత్వం వహించిన "ఖూన్ మెయిన్ హై" అనే షార్ట్ ఫిలిం లో నటించింది కాజల్, అపర్ శక్తి ఖురానా అనే నటుడు కాజల్ తో నటించాడు. పెళ్ళి చూపుల నేపథ్యం లో సాగే ఈ షార్ట్ ఫిలిం లో అమ్మాయీ అబ్బాయీ ఒక కాఫీషాప్ లో కలుస్తారు. అబ్బాయి తన ఫ్యామిలీ గురించీ, తన ఆస్తుల గురించీ గొప్పలు చెప్పుకుంటాడు.

"మా రక్తం లో అన్ని గుణాలూ ఉంటాయి" అంచెప్పగానే.... "కానీ ఆ రక్తాన్ని దానం చేసే గుణం మాత్రం లేదు" అంటూ ఆ అమ్మాయి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. నాలుగు నిమిషాల పాటు సాగే ఈ చిన్న షార్ట్ ఫిలిం లో ఉన్న సందేశాన్ని అందరికీ చేరవేయాలన్న ఉద్దేశంతోనే రెండు రోజుల కింద ఈ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు..

English summary
Kajal Aggarwal and Aparshakti Khurana Best Video "KhoonMeinHai" for Blood Donation
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu