సెలబ్రిటీని కదా అంటూ కాజల్ బిల్డప్
'సింగం" సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న కాజల్ ఇప్పుడు ముంబై మీడియాకు సెంటర్ ఎట్రాక్షన్ గా మారింది.అప్పుడే నార్త్ లో ఆమె పెద్ద సెలబ్రిటీని అయిపోయినట్లు మాట్లాడుతోంది.ఆమె రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ..హిందీ సినిమా చేయడంవల్ల స్వేచ్ఛ కోల్పోయాను. 'సింగమ్"కి ముందు నేనెవరో ముంబైవాసులకు తెలియదు. మొన్న మొన్నటివరకు ముంబైలో ఇబ్బంది లేదు. ఓ సెలబ్రిటీలా కాకుండా మామూలు అమ్మాయిలా ఉండేదాన్ని.థియేటర్లకు వెళ్లి హాయిగా సినిమాలు చూసేదాన్ని. హ్యపీగా షాపింగ్ చేసేదాన్ని. అయితే ఇప్పుడు గుర్తు పట్టేస్తున్నారు. టీవీలో 'సింగమ్" ప్రోమోలు వస్తున్నాయి కదా. వాటిని చూసి, నేనెక్కడైనా కనిపిస్తే చాలు..సింగమ్‌లో నటించింది తనే కదా అని గుసగుసలాడేసుకుంటున్నారు. కాబట్టి ఇక ముంబయిలో కూడా నేను స్వేచ్ఛ కోల్పోయినట్లే అంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











