»   » కాజల్ తో ఆ క్యారెక్టర్ చేయిస్తానంటే వెంటనే డేట్స్ ఇస్తానంటోంది

కాజల్ తో ఆ క్యారెక్టర్ చేయిస్తానంటే వెంటనే డేట్స్ ఇస్తానంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతీ ఒక్కరికీ డ్రీమ్ క్యారెక్టర్స్ ఉంటాయి.అలాగే కాజల్ కు కూడా ఉన్న డ్రీమ్ అనార్కలిగా కనిపించాలనిట. ఈ విషయమై ఆమె చెపుతూ..నా మనసులో బలంగా పాతుకుపోయిన పాత్ర అనార్కలి. ఈ పాత్రలో నన్ను వూహించుకుంటూ ఎన్నో కలలు కన్నాను. అనార్కలి పాత్రలో బరువైన భావోద్వేగాలు ఉంటాయి. ప్రేక్షకుల్ని కదిలించే అంశాలు నిండుగా ఉంటాయి. పైగా ఆ వేషధారణ నాకు బాగా నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చింది. అంటే దర్శక,నిర్మాతలకు ఆమె ఇండైరక్ట్ గా అనార్కలి చిత్రం చేస్తే డేట్స్ ఇస్తానని చెప్తోంది. అలాగే ఆమెకు ఉన్న మరో కోరిక తీరిందని చెప్తోంది. అది యువరాణిగా కనిపించాలనిట. ఆ విషయం చెప్తూ..యువరాణిగా నటించడం నాకు ఇష్టం. అది కాస్తా 'మగధీర'తో నెరవేరింది. ఎందుకంటే కత్తిపట్టి గుర్రపు స్వారీ చేయడంలో ఉండే మజాయే వేరు. తెరపై నా ఆశ చాలా తొందరగానే తీరింది అంది. ఇక మహేష్ సరసన నటించాలనే కోరిక గురించి చెపుతూ...యంగ్ హీరోలందరి చేసాను. కానీ మహేష్‌బాబు సరసన ఎప్పుడు నటిస్తానో అని ఎదురుచూసిన కాజల్‌ కల 'ది బిజినెస్‌ మేన్‌' చిత్రంతో తీరబోతుంది అంది. పూరి జగన్నాధ్ దర్సకత్వంలో రూపొందే ఆ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.

English summary
Mahesh Babu's next film The Business Man, directed by Puri Jagannath.Kajal Aggarwal has been finalized by the makers as the heroine opposite Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu