twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోల భజనలో కాజల్

    By Srikanya
    |

    హిందీ ఎంట్రీ అనుకున్నంత బిజీ చేయకపోవటంతో కాజల్ తన రూటుని తమిళం వైపు తిప్పింది. ఎలాగూ తెలుగు పరిశ్రమలో దాదాపు నెంబర్ వన్ స్దానం ఉంది. దాంతో ఆమె దృష్టిని తమిళ పరిశ్రమపై పెట్టాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఆమె అక్కడ స్టార్ హీరోలైన సూర్య, కార్తీల భజనలో తరిస్తోంది. వారి అండ ఉంటే తమిళంలోసెటిల్ కావచ్చని భావిస్తోంది. రీసెంట్ గా ఆమె సూర్య సరసన కెవి ఆనంద్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో బుక్కైంది. ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...సూర్య, కార్తీ ఇద్దరూ మంచి నటులే. నటనని దైవంలా భావిస్తారు.

    ఇక ఆ హీరోలిద్దరూ కెమెరా ముందుకు రాగానే పాత్రలోకి ఇమిడిపోతారు.నిజం చెప్పాలంటే వాళ్లు నటించరు...జీవిస్తారు అంది. అలాగే తమిళంలో ఎప్పటి నుంచో ఆఫర్స్ వస్తున్నాయి. అయితే తెలుగులో బిజీగా ఉండడం వల్ల ఎక్కువ సినిమాల్లో నటించలేకపోయాను. ఇప్పుడు డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకొనే అవకాశం వచ్చిందని చెప్తోంది. ఇక తెలుగులో ఆమె నటించిన దడ చిత్రం ఆడియో ఈ మధ్యనే విడుదలైంది. నాగచైతన్య హీరోగా చేస్తున్న ఆ చిత్రాన్ని అజయ్ భూయాన్ అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. ఆమె నటించిన సింగం చిత్రం హిందీలో మంచి కలెక్షన్స్ రాబట్టుతోంది. కానీ కాజల్ పాత్ర నిడివి బాగా తగ్గించేయటంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

    English summary
    Kajal is extremely happy at the way her career is moving. She has movies lined up both in Tamil as well as Telugu. She has about three films on hand at present and more are in the pipeline.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X