ఆయిల్ కంపెనీపై కేసు గెలిచిన కాజల్
రీసెంట్ గా కాజల్ అగర్వాల్ ఓ ఆయిల్ కంపెనీపై కేసు వేసి గెలిచింది. ఆ కంపెనీకి ఆమె గతంలో యాడ్ కాంపైన్ చేసింది. అయితే ఆ కాంటాక్టు ఒక సంవత్సరం మాత్రమే ఉంది. వారు సంవత్సరం అయ్యిన తర్వాత కూడా ఆ విజువల్స్ ని,యాడ్స్ ను వారు వాడుతున్నారు. అది గమనించిన ఆమె వారిని చాలా సార్లు హెచ్చరించింది. అంతేగాక వారు కాంటాక్టుని కంటిన్యూ చేయాలంటే తగిన మొత్తం పంపాలని సూచించింది. అయితే వారు వాటిని లెక్క చేయలేదు. అనంతరం ఆమె లాయిర్స్ ని సంప్రదించి నోటిస్ ఇచ్చింది. అయినా వారు సరిగ్గా స్పందించకపోవటంతో వారిపై కోర్టులో కేసు పుటప్ చేసింది.
ఆధారాలన్నీ ఖచ్చితంగా ఉండటంతో ఆమె కేసు గెలిచింది. కోర్టు వారిని పరిహారం కట్టమని,ఇక నుంచి ఆమె పేరు కానీ,ఆమె విజువల్ గానీ ఆ కంపెనీ వారు వాడకూడదని తీర్పు చెప్పింది. కాజల్ చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం కాజల్ ..బిజినెస్ మ్యాన్ హడావిడిలో ఉంది. సంక్రాంతికి విడుదల అవుతున్న ఆ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. 2011 లో ఆమె నటించిన చిత్రాలు వరసగా ఫెయిల్యూర్ అవటంతో నిరాశలో ఉన్న ఆమె బిజినెస్ మ్యాన్ తో తన కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











