ప్రేమ గురించి ప్రేమ కబుర్లు చెబుతోన్న కలల రాణి కాజల్...
రద్దీగా ఉన్న రోడ్డు. హీరో హీరోయిన్ని అక్కడే తొలిసారి చూస్తాడు. ఇద్దరి చూపులూ కలుసుకొంటాయి. అంత వరకూ భీకరమైన ఎండ కాసినా... అప్పుటికప్పుడు మేఘాలు కమ్మేసుకొంటాయి. వెనక ట్రాన్స్‌ఫార్మ్ నుంచి కరెంటు తీగలు కొట్టుకున్న ఎఫెక్టు. పూలు జల జల రాలిపోతాయి... అంతే. ఇవి చాలవూ..నాయకానాయికలు ప్రేమలో పడిపోవడానికి. వెండి తెర మీద ఇలాంటి తొలిచూపు ప్రేమ సన్నివేశాలు బోలెడు కనిపిస్తాయి. కానీ తొలి చూపులోనే ప్రేమ పుట్టేస్తుందా...? ఇదే విషయాన్ని అమాయకంగా అడుగుతోంది కాజల్. 'ప్రేమంటే నాకు చాలా గౌరవముంది. కానీ తొలి చూపు ప్రేమ మీద మాత్రం నమ్మకం లేదు. ఒక్క చూపులోనే జీవితానికి కావల్సిన భరోసా లభిస్తుందంటే ఎందుకో ఒప్పుకోలేను. ప్రేమంటే రెండు మూడు మాటల్లో వ్యక్తీకరించలేని భావన. దాన్ని అనుభవంచడానికి, ఆస్వాదించడానికి జీవితం సరిపోదు' అని ప్రేమ గురించి ప్రేమగా చెప్పుకొచ్చిందీ కలల రాణి.


Click it and Unblock the Notifications











