twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీరలో ఆ సీన్ సూపర్

    By Staff
    |

    మగధీర చిత్రంలో హీరోయిన్ కాజల్ ని రామ్ చరన్ ఛేజ్ చేసే సన్నివేశం బాగా వచ్చింది. ఆమె సిటీ బస్సులో వెళ్తూంటే రామ్ చరణ్ గుర్రంపై వెంబడిస్తూంటాడు. బిజీ ట్రాఫిక్ లో హైదరాబాద్ రోడ్లపై ఈ సీన్ జరుగుతుంది. చరణ్ ఆ ట్రాఫిక్ లోనే ఆమెను ఛేజ్ చేస్తూంటాడు. కథా పరంగా రామ్ చరణ్ కి అప్పుడే. తాను ఎన్నాళ్ళుగానో వెతుకుతున్న అమ్మాయి కాజల్ అని తెలుస్తుంది.దాంతో ఆ ఎమోషన్ ని కంటిన్యూ చేస్తూ దగ్గరలో ఉన్న గుర్రంపై ఆ స్వారీ మొదలెడతాడు. ఆ సన్నివేసం చాలా ఫన్నీగా ఉంటుంది. ట్రాఫిక్ లో అంతా విచిత్రంగా చూస్తూంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఈ సన్నివేశం చిత్రీకరించారు...అంటూ చెప్పుకొచ్చింది కాజల్. మగధీరలో తనకు నచ్చిన సన్నివేశంగా ఈ సన్నివేశం వివరించింది. ఈ నెల ఇరవై తొమ్మిదిన రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి.

    ఇక ఈ చిత్రంలో కాజల్ ఫ్యాషన్ డిజైనర్ గానూ, రాకుమార్తెగాను కనిపించి కనువిందు చేయనుంది. అలాగే ఈ చిత్రంలో తాను నటించటం తన అదృష్టంగా భావిస్తున్నానంటోంది. రోజకు పధ్నాలుగు గంటలు చొప్పున పనిచేయాల్సి వచ్చిందంటోంది. అలాగే ధీర..ధీర..మగధీర అనే పాటలో క్లాసికల్ డాన్సర్ గా కనపడటం కోసం డాన్స్ ప్రాక్టీస్ చేసానని చెప్తోంది. అంతేగాక ప్రిన్సెస్ గా నటించటానికి నేను నా బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవాల్సి వచ్చిందని చెప్తోంది. బలమైన భావోద్వేగాలు ఉన్న సన్నివేశాలు ఉండటంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. కేవలం కళ్ళతోనే కొన్ని ఎమోషన్స్ పలకాల్సి వచ్చేది. అందుకోసం నేను ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేసేదాన్ని. రాజకపూర్, నర్గీస్ నటించిన చిత్రాలు చూసి వారి మధ్య కెమిస్ట్రీ తెరపై పండటానికి కారణాలు పరిశీలించేదాన్ని. అలాగే మేకప్ కోసం రోజుకు రెండు గంటలు పట్టేది. ఈ రోజు నాలుగు వందల ఏళ్ళ సన్నివేశం చేస్తే మరుసటి రోజు కాలేజి అమ్మాయిగా ఈ కాలం సీన్ చెయ్యాల్సి వచ్చేది అంటూ తన అనుభవాలును కాజల్ గుర్తు చేసుకుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X