క్షణం తీరిక లేదంటున్న కాజల్
ప్రస్తుతం ఊపిరి సలపనంత బిజీగా వున్నాను అంటోంది క్యూట్ కథానాయిక కాజల్ అగర్వాల్. "మగధీర" సినిమా విడుదలై మూడువారాలు అవుతున్నప్పటికీ ఆ సినిమా గురించి ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఆ సినిమా విడుదలైన దగ్గర నుంచి వేరే సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాను. ప్రస్తుతం 'ఆర్య 2" లో అల్లు అర్జున్ సరసన ఒక చిత్రంలోనూ అలాగే స్రవంతి మూవీస్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రంలోనూ, ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రంలోనే కాకుండా త్రీ ఏంజెల్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా వున్నాను. దాంతో 'మగధీర" విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను" అంటోంది ఈ అందాల చందమామ.
మరి పవన్ కళ్యాణ్ సినిమాలో మీరే హీరోయిన్ అట కదా! అంటే ఆ సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఆ నిర్మాత సినిమా 'ఆంజనేయులు" ఇటీవలె విడుదలైంది కదా ఆ బిజీలో ఆయన వున్నారు. సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి కాని ఫైనలైజ్ కాలేదు. అలాగే నేను మంచి జరిగినా చెడు జరిగినా మన మంచికే అనుకుంటాను తప్పితే దాని గురించే ఆలోచించి మనసు పాడుచేసుకోను అంటూ వేదాంతం వల్లిస్తోంది కూడా. పారితోషికం పెంచేసారట కదా అంటే నాకు అటువంటి దుర్భుద్ధిలేదు. ఏదైనా క్రమంగా జరగాలి తప్పితే ఒక విజయం వచ్చింది కదా అని విర్రవీగిపోకూడదు అంటూ ఫిలాసఫీ కూడా బాగానే వంట బట్టించుకుంది.


Click it and Unblock the Notifications











