దుర్గా పూజలో సందడి చేసిన కాజోల్ (ఫోటోలు)
ముంబై: దేశ వ్యాప్తంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవరాత్రి ఉత్సవాలతో ఎక్కడ చూసినా సందడే సందడి. పలు చోట్ల సినిమా తారలు దుర్గా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేసారు. ముంబైలో నటి కాజోల్ తన పిల్లలతో కలిసి వచ్చి దుర్గాపూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాజోల్ రాకతో అక్కడ సందడిగా మారింది. కాజోల్ పిల్లలు న్యాసా, యుగ్ అటూ ఇటూ కలియ తిరుగుతూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారారు. ఈ కార్యక్రమానికి కాజోల్ కజిన్స్ అయాన్ ముఖర్జీ, శర్బానీ తదితరులు కూడా పాల్గొన్నారు. కాజోల్‌ను చూసేందుకు పలువురు అభిమానులు అక్కడికి తరలి వచ్చారు.
స్లైడ్‌షోలో కాజోల్ దుర్గామాత పూజలో పాల్గొన్న దృశ్యాలు, వివరాలు.......

కాజోల్
దుర్గాపూజా కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన కాజోల్ తన కారు నుంచి దిగుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

పిల్లలు న్యాసా, యుగ్‌లతో
కూతురు న్యాసా, కొడుకు యుగ్‌ను తీసుకుని దుర్గాపూజా కార్యక్రమానికి ఎంతో సంతోషంగా తరలి వస్తున్న కాజోల్ దృశ్యం.

కజిన్ శర్భానీతో..
తన కజిన్ శర్బానీ ముఖర్జీతో దుర్గామాత ప్రాంగణంలో కాజోల్. శర్భానీ కూడా సినీరంగానికి చెందిన వ్యక్తే. ఆమె పలు చిత్రాల్లో నటించారు.

కజిన్ అయాన్ ముఖర్జీతో...
తన కజిన్ అయాన్ ముఖర్జీతో నటి కాజోల్. అయాన్ ముఖర్జీ ముఖర్జీ బాలీవుడ్ దర్శకుడు, నటుడు. 26 ఏళ్ల వయసులోనే కరణ్ జోహార్ చిత్రం ‘వేక్ అప్ సిద్' చిత్రానికి దర్శకత్వం వహించారు.

దుర్గామాత ఆశీస్సులు
దుర్గామాత ఆశీస్సులు తీసుకుని వస్తున్న కాజోల్. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన కాజోల్ అందరినీ దృష్టినీ ఆకర్షించింది.


Click it and Unblock the Notifications











